Kangana Ranaut: మరో నిజ జీవిత పాత్ర

కంగనా రనౌత్ నిజ జీవిత కథలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. మణికర్ణిక మరియు తలైవి వంటి చిత్రాల తర్వాత, కంగనా ఇప్పుడు మరో నిజ జీవిత డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఆర్ధిక సంక్షోభం వలన విధింపబడిన ఎమర్జెన్సీ గురించి సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది.

ఎమర్జెన్సీ అనే టైటిల్ తో సినిమాని ఈరోజు ప్రకటించారు. ఎమర్జెన్సీ చిత్రంలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది. నటనతో పాటు, కంగనా ఈ ప్రాజెక్ట్‌కి రచన, దర్శకత్వం మరియు నిర్మిస్తోంది. మణికర్ణిక తర్వాత ఆమె దర్శకత్వం వహించిన రెండో సినిమా ఇది. ఈరోజు ఉదయం అనౌన్స్‌మెంట్ టీజర్‌ను కూడా విడుదల చేశారు.

అనౌన్స్‌మెంట్ టీజర్‌లో ఇందిరా గాంధీ గెటప్‌లో కంగనాను చూస్తే, ఆమె పవర్‌ఫుల్ లీడర్‌ పాత్రలో సరిగ్గా సరిపోయింది అని చెప్పొచ్చు. ఇందిరాగాంధీ బాడీ లాంగ్వేజ్ ను, డిక్షన్ ను పర్ఫెక్ట్ గా పట్టుకున్నట్లు అర్ధమవుతుంది.

- Advertisement -

భారతదేశంలో ఇందిర ఎమర్జెన్సీని ప్రకటించడానికి దారితీసిన పరిస్థితులు మరియు ఆ నిర్ణయం తర్వాత జరిగిన క్లిష్ట పరిణామాలతో ఎమర్జెన్సీ చిత్రం డీల్ చేసినట్లు అనిపిస్తుంది. రితేష్ షా స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ రాశారు. జివి ప్రకాష్ కుమార్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. ఎమర్జెన్సీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు