Ranga Ranga Vaibhavanga : అంత గ్యాప్ ఎందుకు ?

ఉప్పెన, కొండపొలం చిత్రాల తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నుండి రాబోతున్న చిత్రం రంగ రంగ వైభవంగా. గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా, ఈ సినిమాను సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తాజా గా ప్రకటించారు. సెప్టెంబర్ 2 అంటే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. పవర్ స్టార్ పుట్టిన రోజున మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉంటారు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ ఈ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

నిజానికి రంగ రంగ వైభవంగా చిత్రం షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. జూలై 1నే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు కూడా మేకర్స్ ఇది వరకు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏకంగా సెప్టెంబర్ 2 వరకు వాయిదా వేశారు. అంటే, రెండు నెలలు వాయిదా వేసినట్టే. ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు అని ప్రశ్నలు వస్తున్నాయి.

దీనికి ఒక కారణం ఉందని సమాచారం. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఈ తరుణంలో మంచి రిలీజ్ డేట్ కోసం అప్పటివరకు ఆగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి తోడు పవర్ స్టార్ ఇమేజ్ ను కూడా వాడు కోవచ్చు. ఇక రంగ రంగ వైభవంగా చిత్రం వైష్ణవ్ తేజ్ తో పాటు కేతీక శర్మ కి కూడా మూడో చిత్రం అన్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు