Kamal Haasan: సర్కారు స్వాధీనం

యూనివర్సల్ హీరో కమల్‌ హాసన్‌ ఇంటిని తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందా? అంటే అవుననే సమాధానం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వం కమల్‌ హాసన్ కు నోటీసులు పంపించడం కూడా జరిగింది అని తెలుస్తుంది. విషయంలోకి వెళితే.. ఇప్పుడు చెన్నైలో రెండో దశ మెట్రో నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యాయి.వేగంగా దీని పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ఇందులో భాగంగా అల్వార్‌ పేట స్టేషన్‌, కమల్ హాసన్‌ నివాసం నుండీ వెళ్లనుందట. ఈ స్టేషన్‌ నిర్మాణం కోసం కమల్ భవనంలోని 170 చదరపు అడుగులు అవసరం పడింది అని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. ఈ స్థలం నిమిత్తమే కమల్‌కు ప్రభుత్వం నోటీసులు పంపినట్టు స్పష్టమవుతుంది. ఇందులో ప్రధాన భాగం ‘రాజ్ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్’ ప్రొడక్షన్ హౌస్, ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీ కార్యాలయం ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే కమల్ కానీ, అటు స్టాలిన్ ప్రభుత్వం కానీ ఇంకా ఈ విషయం పై స్పందించలేదు అంటే బ్యాక్ గ్రౌండ్ లో రాజీ కుదుర్చుకునే పనులు ఏమైనా జరుగుతున్నాయేమో అని కోలీవుడ్ మీడియా అభిప్రాయ పడుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. చాలా గ్యాప్ తర్వాత ‘విక్రమ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ ఆ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు