నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘బింబిసార’ అనే మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత, ‘నిజంగా వశిష్అట్త కు ఇది మొదటి చిత్రమేనా’ అనే డౌట్ వస్తుంది. ఆ రేంజ్ లో ఉంది ట్రైలర్. ఒకసారి ట్రైలర్ ను చూస్తే మనకు తెలీకుండానే రెండు, మూడు సార్లు చూస్తాం. విజువల్స్, నేపధ్య సంగీతం, యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓ పాన్ ఇండియా సినిమాకు కావాల్సిన కంటెంట్ అంతా ఈ సినిమాలో ఉంది అనే భరోసా ఇచ్చింది ట్రైలర్. కానీ, ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడం లేదట.
ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ను త్రిగర్తల సామ్రాజ్యాధిపతి ‘బింబిసార’ గా చాలా టెరిఫిక్ గా చూపించాడు దర్శకుడు. ప్రపంచాన్ని తన ఆధీనంలో పెట్టుకోవాలనుకున్న విలన్, అందుకోసం చేస్తున్న వికృత చర్యలు. టైం బేస్డ్ కాన్సెప్ట్ ఇలా చాలా వైవిధ్యంగా, అలాగే ఆకర్షించే విధంగా ఈ ట్రైలర్ ఉంది. 2 నిమిషాల 39 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్ ను బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ తో కంపేర్ చేస్తున్నారు. అలాగే ‘బింబిసార’ దర్శకుడి పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధికంగా 55 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ ఇది. కానీ ‘ఇంత తక్కువ బడ్జెట్ లో విజువల్స్ ఇంత బాగున్నాయి’. ‘ఇంత తక్కువ బడ్జెట్ లో కూడా ఇలాంటి సినిమా తీయవచ్చా’ అంటూ దర్శకుడిని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. యూట్యూబ్ లో ఈ మూవీ ట్రైలర్ మిలియన్ల మీద మిలియన్ల వ్యూస్ ను కొల్లగొడుతూ చరిత్ర సృష్టిస్తుంది.