Ante Sundaraniki: అంటే ఓటిటి కి

నాని, నజ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికి’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. రిలీజైనప్పటి నుండి ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది, కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్.

ఒక బ్రహ్మాణ అబ్బాయి , ఒక క్రిస్టియన్ అమ్మాయి మధ్య ప్రేమను,
ఆయా కుటుంబాల పద్దతులను అద్భుతంగా తెరకెక్కించాడు వివేక్ ఆత్రేయ. వివేక్ సాగర్ అందించిన సంగీతం “అంటే సుందరానికి” కీలకం అని చెప్పొచ్చు. నాని, నజ్రియాలతో పాటు హర్ష వర్ధన్, రాహుల్ రామకృష్ణ, నందిత, అలగం పెరుమాళ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించారు.

జూన్ 10న రిలీజ్ అయిన “అంటే సుందరానికి” చిత్రం
జూలై 10న సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు