Kajal Aggarwal: ‘కన్నప్ప’లో కాజల్ అగర్వాల్?

Kajal Aggarwal got chance in kannappa: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే టాప్ మోస్ట్ హీరోయిన్గా మారతారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా కొంతమంది హీరోయిన్లకు అస్సలు లక్కు అలాగే ఛాన్సులు రావు. అయితే అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు.

అలాంటి హీరోయిన్లలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకరు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చందమామ, లక్ష్మీ కళ్యాణం లాంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైంది ఈ బ్యూటీ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ పాత్రలు అలాగే ఆమె యాక్టింగ్ నచ్చి వరుసగా చాన్సులు ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఇంకేముంది ఆ తర్వాత రాజమౌళి మరియు రామ్ చరణ్ కాంబినేషన్లో మగధీర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటించి మంచి హిట్ అందుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్.

అయితే గత మూడు సంవత్సరాల కింద వివాహం చేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్… ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ఇటీవల కొడుకు పుట్టారు. దీంతో ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది కాజల్ అగర్వాల్. అలాగే అప్పుడప్పుడు సినిమాలలో అవకాశాలు వస్తే కూడా చక చక చేసేస్తుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్.

- Advertisement -
After Akshay Kumar, Kajal Aggarwal joins Vishnu Manchu's Kannappa
After Akshay Kumar, Kajal Aggarwal joins Vishnu Manchu’s Kannappa

అయితే తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా సినిమా కన్నప్ప. అయితే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కు హీరోయిన్ గా అవకాశం వచ్చినట్టు సమాచారం అందుతుంది. ఈ సినిమాలో పార్వతి పాత్ర లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందట చిత్ర బృందం. అయితే ఈ పాత్ర లో మొదటగా నయన తారను అనుకున్నారు. కానీ ఏ కారణం వల్ల తెలియదు కానీ ఈ ప్రాజెక్టు నుంచి అర్ధాంతరంగా నయన తార తప్పుకుంది.

నయనతార తప్పుకోవడంతో ఆ పాత్ర ఖాళీగా ఉంది. దీంతో నయనతార పాత్రలో కాజల్ అగర్వాల్ కు ఆఫర్ ఇస్తున్నారట చిత్ర బృంద సభ్యులు. ఈ ఆఫర్కు కాజల్ అగర్వాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. అయితే రెమ్యూనరేషన్ విషయంలో… కాస్త అటు ఇటుగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆలోచిస్తున్నారట. నయన తార తప్పుకున్న పాత్రను చేయాలంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారట కాజల్ అగర్వాల్. ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెప్పినట్లుగానే చిత్ర బృందం కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతావ్ అన్నట్టు సమాచారం అందుతుంది. దీనిపై రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు