Jayaprada : “ఆఖరి శ్వాస వరకు సినిమాలు చేస్తా”

ఒకప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు టైం లో కృష్ణంరాజు ఎలాగో… శ్రీదేవి, జయసుధ, వంటి హీరోయిన్ల టైంలో జయప్రద అలా అన్నట్టు ఉండేవారు. అప్పటి యువతని ఈమె తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసింది. అలాగే దేవత వంటి సినిమాల్లో నటనకి స్కోప్ ఉన్న పాత్రల్ని కూడా చేసింది. బాలీవుడ్లో కూడా ఈమె టాప్ హీరోయిన్ గా రాణించింది. రాజకీయాల్లో ఆమె బిజీగా ఉన్నప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంటాను అంటున్నారు.

ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను రాజకీయాల్లో బిజీగా ఉన్నాన‌ని సినిమాలకి దూరంగా ఉంటానని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది అబద్ధం… నేను సినిమాలు చేస్తాను. నా ఆఖ‌రి శ్వాస వరకు సినిమా రంగంలోనే ఉంటాను. దిస్ ఈజ్ మై స్టేట్‌మెంట్‌. దానికి ఎన్టీఆర్ స్ఫూర్తి. ఆయ‌న సీఎంగా ఉన్న‌ప్పుడు కూడా సినిమాలు చేసేవారు. ఇప్పుడు నేను బీజేపీ పార్టీలో ఉన్నప్ప‌టికీ ఏ ప‌ద‌వీ లేదు కాబ‌ట్టి నేను సినిమాలు చేయ‌డానికి ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదు.

నేను చేసిన ‘ల‌వ్ ఎట్ 65’ చిత్రం త్వరలో రిలీజ్ కాబోతోంది. హిందీలో ‘ఫాతిమా’, ఓ పంజాబీ చిత్రాల్లో కూడా నటించాను. అవి కూడా రిలీజ‌వుతున్నాయి. గతంలో నేను 7 భాష‌ల్లో న‌టించాను. ఇప్పుడు పంజాబీలో కూడా నటించాను. అది ఎనిమిదవ భాష‌. తెలుగులో గ్యాప్ వ‌చ్చినా, ఇత‌ర భాష‌ల్లో చేస్తూనే ఉన్నాను. ఇలా ఏదో ఒకరకంగా సినిమాలు చేస్తూనే ఉంటాను” అంటూ వెల్లడించారు జయప్రద.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు