Vijay Devarakonda : బేబమ్మతో రౌడీ హీరో రోమాన్స్..!

`లైగ‌ర్`, `ఖుషి`, `జ‌న గ‌ణ మ‌న‌`.. వంటి మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ మరో క్రేజీ ప్రాజెక్టుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘వి’ చిత్రంతో విమర్శల పాలైన దర్శకుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తో ఓ చిత్రం చేయబోతున్నాడు. ‘వి’ అనుకున్న స్థాయిలో లేకపోయినా ఇంద్రగంటి తక్కువ డైరెక్టర్ ఏమీ కాదు. ప్రేమకథలు తీయడంలో అలాగే జెంటల్ మెన్ వంటి విభిన్న కథా చిత్రాలు తెరకెక్కించడంలో అతను దిట్ట.అందుకే విజయ్ దేవరకొండ ఇతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని టాక్. ఒకవేళ ఆయన కాకపోతే షైన్ స్క్రీన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సంస్థలకి ఇంద్రగంటి ఓ సినిమా చేయాల్సి ఉంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుందట. ఇందులో విజ‌య్ కి జోడీగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి నటించబోతుందని సమాచారం.ఇంద్రగంటికి హీరోయిన్లను రిపీట్ చేయడం సెంటిమెంట్. స్వాతి, ఈషా రెబ్బా, నివేదా థామ‌స్, అదితి రావ్ హైద‌రీ – ఇలా త‌న హీరోయిన్లతో రెండేసి సినిమాలు తీసాడు అతను. ఇప్పుడు కృతి శెట్టితో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`చిత్రం చేస్తున్నాడు కాబట్టి కృతి శెట్టిని మళ్ళీ రిపీట్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు