Anil Ravipudi “ఆ సినిమాలు చేయాలేను”

‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇప్పుడు ‘ఎఫ్3’ వంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన పై, తన సినిమాల పై వస్తున్న ట్రోల్స్ పై స్పందించాడు.

అనిల్ రావిపూడి వీటిపై స్పందిస్తూ.. “నన్ను తిట్టుకునే బ్యాచ్ చాలామందే ఉన్నారు. వాళ్ళకి నన్ను తిట్టుకోవడం కూడా ఓ ఫన్.వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.అది ఎంత నిజమో నా సినిమాల్ని ఎంజాయ్ చేసే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు అనేది కూడా అంతే నిజం. నా సినిమాలు, నా కెరీర్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే నాకు నా కెరీర్ పై క్లారిటీ ఉంది.

మిలిటరీ హోటల్ లో నాన్ వెజ్ పెడతారు, బ్రాహ్మణ హోటల్ లో వెజ్ పెడతారు. ఇది తెలిసి కూడా నాన్ వెజ్ తినే ఒకడు బ్రాహ్మణ హోటల్ కు వెళ్లి వెజ్ తినేవాళ్ళని అలాగే వెజ్ ఐటమ్స్ ను తిడితే బాగుంటుందా.? నీకు ఇష్టం లేదు అంటే మిలిటరీ హోటల్ కు వెళ్లి నాన్ వెజ్ ఫుడ్ తిను.నా సినిమాలో ఏముంటుందో ప్రమోషన్స్ టైములో నేను చెబుతున్నాను కదా. నేను బుచ్చిబాబు లా ‘ఉప్పెన’ తీయలేను.. బుచ్చిబాబు నా సినిమాల్లా తీయలేడు.

- Advertisement -

నేను సుకుమార్ గారిలా ‘పుష్ప’ తీయలేను, అంత క్రియేటివిటీ నాలో లేదు.. అలాగే ఆయన నాలా సినిమా చేయలేకపోవచ్చు. నన్ను తిట్టుకునే వాళ్ళు నా నుండీ కొత్తదనం కోరుకుంటున్నారేమో.. భవిష్యత్తులో వారు కోరుకునే కొత్త సినిమా ఇవ్వగలనేమో.” అంటూ స్ట్రాంగ్ గా సమాధానమిచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు