James gunn : హాలీవుడ్ లో వినిపిస్తున్న ఎన్టీఆర్ పేరు !

జూనియర్ ఎన్టీఆర్ పేరే ఇప్పుడు ఒక సంచలనంగా మారింది.ఇక్కడ ,అక్కడ అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తం ఆయన పేరు వినిపిస్తోంది. RRR సినిమాతో ఖండాంతరాలు దాటినా తెలుగు సినిమా ఖ్యాతి రోజు రోజుకి ఒక్కో మెట్టు ఎక్కుతూనే ఉంది.

ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు RRR సినిమాతో ఎన్టీఆర్ నటనకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంశలు అందుకుంటున్నాడు. ఇప్పటికే స్టీవెన్ స్పీల్‌బెర్గ్, జేమ్స్ కామెరాన్ లాంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు రాజమౌళి , రామ్ చరణ్ ,ఎన్టీఆర్ గురించి చాలా సార్లు మాట్లాడారు. అలాగే ఇటీవలనే RRR సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ కూడా వచ్చింది.

అయితే లేటెస్ట్ గా మరో హాలీవుడ్ దర్శకుడు ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన స్పైడర్ మ్యాన్ , ఐరన్ మ్యాన్ అవెంజర్స్ లాంటి సూపర్ హిట్ సినిమాలని ప్రొడ్యూస్ చేసిన హాలీవుడ్ లో అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ మార్వెల్ స్టూడియోస్. అలాంటి గొప్ప పేరున్న సంస్థలో డైరెక్టర్ గా పని చేసిన జేమ్స్ గన్ RRR సినిమా చూసి ఎన్టీఆర్ గురించి మాట్లాడారు.

- Advertisement -

RRR సినిమాలో ఇంటర్వెల్ సీన్ గురించి ఆయన మాట్లాడుతూ ” ఇంటర్వెల్ లో జంతువుల అన్నిటితో పాటు బయటికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు ? ఆయన నటన నాకు చాలా బాగా నచ్చింది. ఎదో ఒకరోజు నేను అతనితో వర్క్ చేయాలనుకుంటున్న ” అని ఆయన అన్నారు ఈయన గతం లో గార్డియన్స్ అఫ్ గెలాక్సీ అనే సినిమా తీశారు . ఇది హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది అంతేగాకా డి.సి కామిక్స్ సంస్థలో ఈయన సూసైడ్ స్క్వాడ్ అనే సినిమాని తీశారు. డిసి సంస్థ లోనే ఈయన ప్రముఖ వ్యక్తి . మరి అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ , ఎన్టీఆర్ తో పని చేయాలనీ ఉంది అని చెప్పడం గొప్ప విషయమనే చెప్పాలి.

ఎన్టీఆర్ ప్రస్తుతం శివ కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ నటిస్తుంది, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు