F3 : దిల్ రాజు ఇంకా ఆశలు పెట్టుకున్నారా ?

‘అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకని’ మన పెద్దవాళ్ళు ఎందుకు అన్నారో.. ఈ తరానికి అర్ధమయ్యేలా చెప్పాలి అంటే ‘ఎఫ్3’ సినిమా గురించి, అలాగే ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు గురించి చెబితే సరిపోతుంది. విషయంలోకి వెళ్తే, ‘ఎఫ్3’ ‘సినిమా మే 27న విడుదలైన విషయం తెలిసిందే. ‘ఎఫ్2’ క్రేజ్, అలాగే మల్టీస్టారర్ అట్రాక్షన్ తోడవ్వడంతో ఈ సినిమాపై హైప్ భారీగా పెరిగింది. ఆ అంచనాలకు తగ్గట్టు పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. దాంతో మొదటి వారం ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయి. అయితే రెండో వారంలో విక్రమ్, మేజర్, అంటే సుందరానికీ మధ్య తీవ్ర పోటీ ఉండటంతో ఈ చిత్రం నిలబడలేకపోయింది. నిర్మాత దిల్ రాజు బలవంతంగా కొన్ని థియేటర్లను హోల్డ్ చేసి నడిపిస్తున్నారు. కానీ, పెద్దగా ఫలితం మాత్రం దక్కడం లేదు.

అయినా, నిర్మాత దిల్ రాజు మాత్రం తగ్గడం లేదు. ఓ సక్సెస్ మీట్ పెట్టి, తమ సినిమా 3 వ వారం పూర్తి కావస్తున్నా, మంచి కలెక్షన్లు రాబడుతోంది అంటూ చెప్పుకొచ్చారు. ఓ పక్క ‘మేజర్’ ‘విక్రమ్’ వంటి సినిమాలు పోటీగా ఉన్నాయి. మరోపక్క కొత్తగా విడుదలైన ‘అంటే సుందరానికీ!’ కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి సమయంలో ప్రేక్షకులు ఈ చిత్రాలను పక్కన పెట్టి, ‘ఎఫ్3’ చూస్తారా ?. అంతా తెలిసిన నిర్మాత దిల్ రాజు బోలెడంత ఖర్చు పెట్టి సక్సెస్ మీట్ పెట్టడం వెనుక కారణమేంటి ? అని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు