Gopi Chand : రిస్క్ చేస్తున్నాడా ?

ఒకప్పుడు గోపీచంద్ మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ విజయ్ దేవరకొండ, నాని వంటి హీరోలు రాకెట్ లా దూసుకురావడంతో రేసులో వెనక్కి పడ్డాడు. సీటీమార్ కు ముందు వరకు గోపి నటించిన సినిమాలు అన్నీ ఫ్లాపులే. అది కూడా బ్లాక్ బస్టర్ ఏం కాదు. కానీ, గోపీచంద్ కు కావాల్సిన హిట్ ను అందించింది. త్వరలో గోపీచంద్ పక్కా కమర్షియల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. గీత ఆర్ట్స్ కాంపౌండ్ నుండి వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీ హిట్ అవడం మినిమం గ్యారెంటీ ఉంటుంది. అంతే కాకుండా, బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

దీంతో గోపి ఫామ్ లోకి వచ్చేసినట్టే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కానీ, అతను చేయబోయే సినిమాల లైనప్ మాత్రం అంతగా బాలేదు. ప్రస్తుతం అతను శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీవాస్ ఈ మధ్య కాలంలో ఫాంలో లేడు. కానీ, గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చే సినిమాలకి క్రేజ్ ఉంది. కాబట్టి, ఈ సినిమాపై అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. కానీ, తర్వాత భగవాన్, పుల్లారావు నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే బ్యానర్ లో శంఖం, గౌతమ్ నంద లాంటి ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా వాళ్ళ బ్యానర్లో చేయడానికి ఓకె చెప్పడం పై గోపి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దీంతో ఈ మ్యాచో స్టార్ రిస్క్ చేస్తున్నాడని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు