Genelia : రీ ఎంట్రీకి జెనీలియా రెడీ ?

బాయ్స్, బొమ్మరిల్లు, ఢీ, రెడీ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన జెనీలియా, రితేష్ దేష్ ముఖ్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. తెలుగులో జెనీలియా నటించిన ఆఖరి చిత్రం నా ఇష్టం. రానా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే 10 ఏళ్ళ తర్వాత ఈమె రీ ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. అది కూడా ఓ కన్నడ బైలింగ్యువల్ మూవీతో అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే, కర్ణాటక మినిస్టర్ గాలి జనార్ధన రెడ్డి కొడుకు కిరీటి హీరోగా ఓ బిలింగ్యువల్ మూవీ తెరకెక్కనుంది. ఈ డెబ్యూ మూవీని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. స్టార్ క్యాస్ట్ ను తీసుకోవాలి అని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జెనీలియా ని ఓ ముఖ్య పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం.

ఈ మూవీలో జెనీలియా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ సి.ఈ. ఓ గా కనిపించబోతుందని టాక్. త్వరలోనే జెనీలియా పాత్ర గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు