Indian 2 Release Date : ఇండస్ట్రీకి శంకర్ రెడ్ అలర్ట్… సేనపతి వచ్చేస్తున్నాడు

Indian 2 Release Date : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ నుంచి వచ్చే సినిమాలంటే మినిమం గ్యారంటీ ఉంటాయి. సినిమాకు సినిమాకు కాస్త టైం తీసుకున్నా ఆడియన్స్ కు ఎంటర్‌టైన్మెంట్ పక్కా ఉంటుంది. శంకర్ నుంచి చివరి సినిమా 2.o 2018లో వచ్చింది. దీని కంటే ముందు సినిమా I ( ఐ ) 2015లో వచ్చింది ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్నే సాధించాయి.

ఇప్పుడు శంకర్ మళ్లీ గ్యాప్ తీసుకుని ఈ ఏడాది ఏకంగా రెండు సినిమాలతో రాబోతున్నాడు. ఒకటి కమల్ హాసన్‌తో ఇండియన్ 2. మరొకటి.. గ్లోబల్ స్టార్ డాక్టర్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్. ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకే సారి చేస్తూ వచ్చారు డైరెక్టర్ శంకర్. ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 మూవీ రిలీజ్ నెలను డైరెక్టర్ శంకర్ అనౌన్స్ చేశారు.

ఈ ఏడాదిలోనే జూన్ నెలలో ఇండియన్ 2 ను విడుదల చేయబోతున్నట్టు మూవీ మేకర్స్ కాసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఇండియన్ 2 మొత్తం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

- Advertisement -

సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?

శంకర్ కెరీర్ లో ఇప్పటి వరకు జూన్ నెలలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి అపరిచితుడు. మరొకటి… శివాజీ ది బాస్. ఈ రెండు సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. అపరిచితుడు సినిమా 20 కోట్ల బడ్జెట్ తో వస్తే అ రోజుల్లోనే… 60 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక శివాజీ ది బాస్ మూవీ అయితే కేవలం 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే 160 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఇండియన్ 2 కూడా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు