Chiranjeevi: సైరా నరసింహారెడ్డి మూవీతో అన్ని కోట్లు పోగొట్టుకున్న చిరు..!

Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత నటించిన చిత్రం ఖైదీ 150.. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఇదే దూకుడుతో వరుస సినిమాలు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే తన కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా చేయాలని ఎన్నో సంవత్సరాల పాటు కలలు కన్న చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తర్వాత చేసిన చిత్రమే ఇది. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సొంత బ్యానర్ లో రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాను నిర్మించారు రామ్ చరణ్.. ఈ సమయానికి ఇది చాలా రిస్క్ అనిపించినా.. చిరంజీవి డ్రీం ప్రాజెక్టు విషయంలో రామ్ చరణ్ ఎక్కడ రాజీపడలేదు.. అయితే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.. కానీ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఆడలేదు.. ముఖ్యంగా ఈ సినిమాను సూపర్ హిట్ అంటూ అప్పట్లో ప్రచారం చేశారు కానీ ఈ సినిమా వల్ల మెగా ఫ్యామిలీకి నష్టాలు మాత్రం తప్పలేదని ఇటీవల చిరంజీవి వెల్లడించారు..

Chiranjeevi:Chiru lost all the crores with Saira Narasimha Reddy movie..!
Chiranjeevi:Chiru lost all the crores with Saira Narasimha Reddy movie..!

సైరా నష్టం పై చిరంజీవి స్పందన..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి స్వయంగా సైరా నరసింహారెడ్డి సినిమాకి తాము ఎంత నష్టం ఎదుర్కొన్నారో వెల్లడించారు.. ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్ తో జరిగిన ఒక చర్చా కార్యక్రమములో చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా గురించి మాట్లాడారు.. చిరంజీవి మాట్లాడుతూ..ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలు, సినిమాలతో పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను.. మనం ఎదురు చూసే పాత్రలు ప్రతిసారి కూడా మనకు రావు.. వాటంతటవే మన దగ్గరకు రావాలి.. అప్పుడే మనం సంతృప్తి చెందుతాము..

కల నెరవేరింది కానీ చిల్లు తప్పలేదు..
అయితే స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలని నాకు ఎప్పటినుంచో ఉండేది. ఆ కల సైరా నరసింహారెడ్డి తో తీరింది .కానీ ఆ చిత్ర ఫలితం నాకు సంతృప్తిని ఇవ్వలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా యావరేజ్ గానే నిలిచింది .మిగతా చోట్ల మాత్రం బాగా ఆడింది కానీ ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయాము. అయితే నా సంతృప్తి కోసం నేను సినిమాలు తీస్తే నిర్మాత జోబు ఖాళీ అవడం ఖాయం.. గతంలో రుద్రవీణ లాంటి గొప్ప సినిమా చేశాను.. మంచి పేరు వచ్చింది కానీ ఈ సినిమాను నిర్మించిన నా తమ్ముడు నాగబాబుకి మాత్రం డబ్బులు రాలేదు. అందుకే తర్వాత నిర్మాతల బాగు కోసం కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేయాల్సి వచ్చింది అంటూ అసలు విషయాన్ని వెల్లడించారు.

- Advertisement -

నిర్మాతలు నష్టపోకూడదు..
నిర్మాతలు నష్టపోకూడదు కాబట్టే నేను కమర్షియల్ చిత్రాలు మాత్రమే చేస్తాను అంటూ నిర్మాతల గురించి ఆలోచించి గొప్ప మనిషి చాటుకున్నారు చిరంజీవి. అంతేకాదు తన సినిమాల నష్టాలను కూడా ఈ విధంగా స్పష్టం చేశారు. ఏదేమైనా ఇకపై చిరంజీవి కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తానని.. ఇక వేరే పాత్రల జోలికి వెళ్ళను అని ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు. మొత్తానికైతే చిరంజీవి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు