Shakalaka Shankar: జనసేన పార్టీ కోసం నా డబ్బు మొత్తం ఖర్చు పెట్టాను.. ప్రజెంట్ నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు.. షకలక శంకర్..!

Shakalaka Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ విధంగా ఉందో మన అందరికీ తెలిసిందే. ఆయన కోసం ఎంతోమంది ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు. అయితే పవన్ అంటే సినీ ప్రేక్షకులకు కూడా ఎంతో ఇష్టం. కొందరు ఆయనని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వారు కూడా ఉన్నారు.

అయితే సినీ నటుడు షకలక శంకర్ కూడా పవన్ కు వీరాభిమాని. తరచుగా తన అభిమానం చూపిస్తూనే ఉంటాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ” కొన్ని సినిమాల్లో నటించడానికి అడ్వాన్స్ ఇచ్చారు. ఈ విషయం నేను ఇంట్లో చెప్పలేదు. వాళ్లు నాకోసం ఎదురు చూస్తున్నారు. కానీ నేను గత ఎన్నికల్లో సొంత డబ్బుతో ప్రచారం చేశాను. మూడు లక్షలతో భోజనాలు పెట్టించి ఎంతోమంది ఆకలి తీర్చాను.

I have spent all my money for the Janasena party.. Presently I don't even have chilli flakes.. Shakalaka Shankar
I have spent all my money for the Janasena party.. Presently I don’t even have chilli flakes.. Shakalaka Shankar

తీరా ఇంటికి వెళదామనే సరికి చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది. మా ఫ్రెండ్ తో వెయ్య రూపాయల డీజిల్ కొట్టించుకుని ఇంటికి వెళ్ళాను. డబ్బులు అన్ని ఖర్చు పెట్టాను అని చెబితే నా భార్య నాలుగు రోజులు తిట్టడం ఆపలేదు. అదేవిధంగా ఈసారి కూడా నేను డబ్బును ఖర్చు పెట్టాను. ప్రజెంట్ నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ” అంటూ చెప్పుకొచ్చాడు శంకర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు