Fighter Telugu Twitter Review: ఫైటర్ తెలుగు ట్విట్టర్ రివ్యూ.. డోంట్ మిస్..!

ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే తాజాగా నటించిన చిత్రం ఫైటర్.. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదల అవగా.. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారు..? పబ్లిక్ టాక్ ఎలా ఉంది..? అసలు క్రిటిక్స్ ఎలాంటి కామెంట్స్ చేశారు? అనేది ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్.. వార్, పఠాన్ చిత్రాల తర్వాత తెరకెక్కించిన చిత్రం ఫైటర్. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇక ఈ సినిమాపై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఫైటర్ సినిమా గురించి ట్విట్టర్ ద్వారా ఇలా ట్వీట్ చేశారు. ఫైటర్ సినిమా బ్రిలియంట్.. డోంట్ మిస్ ఇట్ అంటూ రివ్యూ ఇవ్వడమే కాకుండా.. 4.5/5 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు. నిజానికీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. పైగా బజ్ కూడా తక్కువగా ఉందని అన్నారు. కట్ చేస్తే తరణ్ ఆదర్శ్ మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూలు ఇవ్వడం ఇప్పుడు సినిమా పై అంచనాలను పెంచేస్తోంది. అంతే కాకుండా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ను కూడా ఫైటర్ మూవీకి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

Hrithik Roshan Fighter Movie Twitter Review

- Advertisement -

ట్విట్టర్ రివ్యూ ద్వారా దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ హ్యాట్రిక్ అందుకున్నారు. ఏరియల్ కం బ్యాక్, డ్రామా ,యాక్షన్, ఎమోషన్స్, దేశభక్తి ఇలా అన్ని కోణాలను ఫైటర్ లో చాలా అద్భుతంగా ఎలివేట్ చేశారని అంటున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ సాహసోపేతమైన నటన సినిమాకే టాప్ క్లాస్ లో నిలబడిందని. కచ్చితంగా ఈ సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు అంటూ రివ్యూ ఇస్తున్నారు. దేశం కోసం నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న వీరులకు ఫైటర్ ఘన నివాళి అర్పిస్తుందని, సెకండ్ హాఫ్ చాలా బాగుందని.. ముఖ్యంగా ప్రేక్షకులు చేత చప్పట్లు కొట్టించే డైలాగ్స్ ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయని అంటున్నారు.

ఫైటర్ సినిమా వన్ మ్యాన్ షో అని.. ఇందులో మరో డౌట్ లేదని చెబుతున్నారు. అంతేకాదు హృతిక్ రోషన్ – దీపికా జోడి మరింత అందంగా ఉందని.. దీపిక కూడా హృతిక్ తో పోటీపడి మరీ నటించింది అంటూ తెలిపారు. ఈ సినిమాలో నటించిన అక్షయ్ ఒబెరాయ్, రిషబ్, కరణ్ సింగ్ గ్రోవర్ , అనిల్ కపూర్ ల నటన గురించి కూడా ఆడియన్స్ పాజిటివ్ గా ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఓవర్సీస్ నుంచి కూడా ఈ సినిమాకి ట్విట్టర్ రివ్యూలు వస్తున్నాయి.. సినిమా చాలా అద్భుతంగా ఉందని.. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ వినిపిస్తూ ఉండడం గమనార్హం. దేశభక్తి కాన్సెప్ట్ లో వచ్చిన ఈ సినిమా రిపబ్లిక్ డే కి విడుదల చేసి మేకర్స్ మంచి పని చేశారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Hrithik Roshan Fighter Movie Twitter Review

Hrithik Roshan Fighter Movie Twitter Review

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు