Guneet Monga: ఆస్కార్ విజేత కు ఘోర అవమానం

95 వ ఆస్కార్ వేడుకలలో మన ఇండియా నుండి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ” నాటు నాటు” సాంగ్, కార్తికి గొన్సాల్వెన్స్ తెరకెక్కించిన “ది ఎలిఫెంట్ విస్పరర్స్” సినిమాకి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ అవార్డులు గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఆస్కార్ అవార్డులు సాధించడంతో సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఈ రెండు టీమ్స్ కి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆస్కార్ అకాడమీ చేసిన ఓ చర్య వల్ల ” ది ఎలిఫెంట్ విస్పరర్స్” నిర్మాత గునీత్ మోంగా కి చేదు అనుభవం ఎదురైంది. వేదికపై ఈ పురస్కారాన్ని అందుకునేటప్పుడు ది ఎలిఫెంట్ విస్పరర్స్ కి దర్శకత్వం వహించిన కార్తికి, గునీత్ మోంగ ఎంతో సంబరపడిపోయారు. ఆస్కార్ అందుకున్న తర్వాత 45 సెకండ్లు మాట్లాడేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. కానీ గునిత్ మోంగాకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.

ఈ విషయాన్ని ఆమె ఇండియాకి తిరిగి వచ్చాక విలేకరులతో పంచుకున్నారు. శుక్రవారం ఉదయం అమెరికా నుండి ముంబైకి వచ్చిన “ది ఎలిఫెంట్ విస్పరర్స్” నిర్మాత గునీత్ మోంగాకి ముంబై ఎయిర్ పోర్టులో భారీ స్వాగతం లభించింది. తన ఆస్కార్ అవార్డుతో అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు గునీత్ మోంగా. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “ఈ కేటగిరి లో మాతోపాటు ఉన్న సినిమాలు మాకు బలంగా పోటీ ఇచ్చాయి. కానీ మా సినిమా అందరినీ మెప్పించి ఆస్కార్ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ వేదికపై నేను మైక్ తీసుకుని మాట్లాడబోతుంటే మ్యూజిక్ రావడంతో నేను చెప్పాలనుకున్నవి చెప్పలేకపోయా. గొప్ప క్షణాలను ఇచ్చినట్లే ఇచ్చి నా దగ్గర నుంచి లాక్కున్నట్లు అనిపించింది. నా తర్వాత అవార్డులు అందుకున్న కొంతమంది 45 సెకండ్ల కంటే ఎక్కువ మాట్లాడిన ఏం అనలేదు. వాళ్ల స్పీచ్ ఆపలేదు. ఈ విషయంలో ఆస్కార్ వాళ్ళు చేసింది సరైంది కాదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

For More Updates :

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు