Godfather: ఫస్ట్ సింగిల్ ప్రోమో

మెగాస్టార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ” గాడ్ ఫాదర్”. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ కు ఇది తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రమోషన్స్ ను గ్రాండ్ గా ప్రారంభించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను మలయాళం తప్ప మిగిలిన కన్నడ, తమిళ్, హిందీలో విడుదల చేయాలనుకున్నారు.. కానీ తెలుగు ,హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

అలాగే సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాథ్ వంటి వారు ఇతర కీలకపాత్రలలొ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా గాడ్ ఫాదర్ మూవీ నుంచి మంగళవారం ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది. “తార్ మార్ తక్కర్ మార్” అంటూ సాగే ఈ పూర్తి పాట సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇండియాలోని ఇద్దరు అతిపెద్ద మెగాస్టార్లు వచ్చేశారు అంటూ ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై చిరు, సల్మాన్ కలిసి కనిపించనున్నారు. ఈ ఇద్దరు కలిసి స్టెప్పులు వేయడం అభిమానులను కచ్చితంగా అలరిస్తోంది. ఈ ఇద్దరు మెగాస్టార్ ల కోసం తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సాంగ్ లో చిరు, సల్మాన్ ఇద్దరూ ఒకేలాంటి డ్రెస్సులు వేసుకొని సింపుల్ స్టెప్పులతో అదరగొట్టారు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు