Gam Gam Ganesha : గం గణేశా బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్క…

Gam Gam Ganesha : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినా, డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. దొరసాని అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయమైన ఆనంద్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకోగా, లాస్ట్ ఇయర్ బేబి మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. అందులో ఇతర నటీనటులు సమానంగా ఉన్నా, నటన పరంగా ఆనంద్ దేవరకొండ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ అయిన “గం గం గణేశా”(Gam Gam Ganesha) మూవీతో ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉన్నాడు. ఈ సినిమా నుండి ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండి సినిమాపై అంచనాలు పెంచేసాయి. తాజాగా ఈ సినిమా బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ వచ్చాయి.

Gam Gam Ganesha movie business & break even target

డీసెంట్ బిజినెస్ చేసిన గం గణేశా..

లాస్ట్ ఇయర్ బేబి మూవీ తో ఊహకందని విజయాన్ని అందుకుని టోటల్ రన్ లో 80 కోట్ల రేంజ్ లో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ నుండి వస్తున్న గం గం గణేశా సినిమాతో ఆనంద్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండగా, వరల్డ్ వైడ్ గా 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ బిజినెస్ రేంజ్ 4.5 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా. ఇక వరల్డ్ వైడ్ గా బిజినెస్ 5.5 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే 6 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -

పోటీ లో గట్టి టార్గెట్..

ఇక బేబి లాంటి మాసివ్ సక్సెస్ తర్వాత ఆనంద్ దేవరకొండ సినిమాకి ఇది కొంచం తక్కువ బిజినెస్ అయినా, పోటిలో ఉన్నంతలో సినిమా రిలీజ్ రేంజ్ కి ఇది రీజనబుల్ రేటు అని చెప్పాలి. అయినా సినిమాకి ఉన్న హైప్ ని బట్టి గట్టి టార్గెట్ అనే చెప్పాలి. ఈ సినిమాను ఉదయ్ బొమిశెట్టి దర్శకత్వం వహించగా, వంశీ కృష్ణ కారుమంచి నిర్మించాడు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించింది. ఇక వెన్నెల కిషోర్, నయన్ సారిక, రాజ్ అర్జున్, సత్యం రాజేష్, ప్రిన్స్ యావర్, ఇమ్మాన్యుయేల్, కృష్ణ చైతన్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక గం గణేశా (Gam Gam Ganesha) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు