Friday Box-office : ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు… ఈ ఒక్క మూవీని మాత్రం డోంట్ మిస్

Friday Box-office : గత నెల రోజులుగా తెలుగు చిత్రసీమలో స్టార్ నటీనటుల సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. మార్చి 29న ‘టిల్లు స్క్వేర్’ రిలీజై భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఇక ఇప్పుడు ఐపీఎల్, ఎన్నికల కారణంగా పెద్ద సినిమాలను విడుదల చేయడం లేదు మేకర్స్. దీంతో థియేటర్ల యాజమాన్యం భారీగా నష్టపోతున్నారు. కాబట్టి ఖర్చులు తగ్గించుకునేందుకు రెండు వారాల పాటు థియేటర్లు మూసివేయాలనే నిర్ణయానికి ఎగ్జిబిటర్లు వచ్చారు. ఈ నేపథ్యంలోనే సత్యభామ, రాజు యాదవ్ లాంటి సినిమాలు ఈ వారం రిలీజ్ కావలసి ఉండగా, వాయిదా పడ్డాయి. అయితే ఇంకా మల్టీప్లెక్స్ లు మాత్రం ఓపెన్ చేసే ఉండడంతో పలు హాలీవుడ్ సినిమాలు మాత్రం రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాపై ఓ లుక్కేద్దాం.

Furiosa: A Mad Max Saga (2024) – watch online in high quality on Sweet TV

1. ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్

మ్యాడ్ మ్యాక్స్ కు ప్రీక్వెల్ గా ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా పేరుతో నెక్స్ట్ సిరీస్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ ప్రీక్వెల్ మే 23న థియేటర్లలోకి రాబోతోంది. అయితే తాజాగా ఈ విజువల్ వండర్ ను కేన్స్ లో ప్రదర్శించగా స్టాండింగ్ ఒవేషన్ లభించినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీకి జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించగా క్రిస్ హెమ్స్ వర్త్, అన్నా టైలర్ జాయ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని దాదాపు 1400 కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించినట్టు సమాచారం. మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ లో ఇప్పటి వరకు ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

- Advertisement -

అందులో 2015లో రిలీజ్ అయిన మ్యాడ్ మాక్స్ ప్యూరి రోడ్ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ మూవీకి ఆరు ఆస్కార్ అవార్డులు రావడం విశేషం. ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న ప్యూరియోసా ఐదో పార్ట్ కాగా, మ్యాడ్ మ్యాక్స్ ది వెస్ట్ ల్యాండ్ పేరుతో ఆరో పార్ట్ కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రస్తుతానికి మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ ను చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది.

Turbo (2024) - Movie | Reviews, Cast & Release Date in attingal- BookMyShow

2. టర్బో

ప్రస్తుతం భ్రమయుగం మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ తో ఉన్న మమ్ముట్టి నటిస్తున్న కొత్త మూవీ టర్బో. ఈ చిత్రాన్ని మే 23న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి విలన్‌గా నటించారు. ఈ చిత్రంలో అంజనా జయప్రకాష్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్, బిందు పనికర్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు కమెడియన్ సునీల్ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మూవీ మాత్రం మలయాళంలోనే రిలీజ్ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు