Radhika apte: వామ్మో బరితెగించేసిన బాలయ్య బ్యూటీ.. కండోమ్స్ వాడకంపై స్పెషల్ క్లాస్..

Radhika apte.. చలనచిత్ర పరిశ్రమల్లో ఎంతోమంది హీరోయిన్లు ఎన్నో విషయాలపై స్పందిస్తూ ఉంటారు.. అయితే కొంతమంది హీరోయిన్లు స్పందించే ఆ అంశాలను బట్టి ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలయ్య బ్యూటీ కూడా బోల్డ్ గా కామెంట్లు చేయడంతో ఆమె మళ్ళీ వైరల్ గా మారింది.. బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న రాధిక ఆప్టే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. తెలుగులో రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలయ్య సరసన లెజెండ్ సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.. ఈ సినిమా తర్వాత తెలుగులో ఎక్కువగా అవకాశాలను అందుకోలేక పోయింది రాధిక ఆప్టే.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ అడల్ట్ వెబ్ సిరీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈమె ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొకపక్క యాడ్స్ చేస్తూ బిజీగా మారిన రాధిక ఆప్టే తాజాగా కండోమ్ యాడ్ చేయడంతో అది కాస్త వైరల్ అయిపోయి.. ఈమెను ట్రోల్స్ కి గురిచేస్తోంది.

కండోమ్స్ పై రాధిక క్లాస్..

Radhika apte: Balayya beauty stripped of vammo.. Special class on condom use..
Radhika apte: Balayya beauty stripped of vammo.. Special class on condom use..

శృంగారం, కండోమ్స్ గురించి ఇండియాలో మాట్లాడడం చాలా పెద్ద నిషేధం అన్నట్లు అందరూ చూస్తారు . కానీ ఈ జనరేషన్లో ఇలాంటివి తెలుసుకోకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెబుతోంది రాధిక.. ఈ క్రమంలోనే తాజాగా రాధిక కండోమ్స్ ను ప్రమోట్ చేసింది.. కండోమ్స్ .. అమ్మాయిలు ఎలాంటి కండోమ్స్ వాడాలి ? ఎలా వాడాలి ?అనే విషయాలను కూడా చెప్పుకొచ్చింది.. రాధిక చేసిన యాడ్ విషయానికొస్తే.. కండోమ్స్.. సమాజంలో ఈ పేరు పలకడం నిషేధం.. ఎందుకు? కండోమ్స్ ఎప్పుడు మన పార్ట్నర్స్ ఛాయిస్ కే మనం వదిలేస్తున్నాం.. ఎందుకు? ఈ నిర్ణయంలో మన మాటకు పట్టింపు ఉండదా..? మనం సుఖం వదిలి .. బాధను భరిస్తూ.. కంఫర్ట్ లేని అలాంటి కండోమ్స్ మనం ఎందుకు భరించాలి ?కండోమ్స్ విషయంలో మన సొంత నిర్ణయం ఎందుకు ఉండకూడదు? అందుకే మనకు ఆనందాన్ని , కంఫర్ట్ ని ఇచ్చే కండోమ్ ను మాత్రమే వాడాలి.. ఎపిక్ కండోమ్స్.. ఎవరో ఏదో అనుకుంటారని చింతించకండి.. అమ్మాయిలు మీ కండోమ్స్ మీరే కొనుక్కోండి అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ..

రాధిక ఆప్టే పై ట్రోల్స్ ..

ప్రస్తుతం ఈ యాడ్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఇలాంటి విదేశాలలో పెద్దగా పట్టించుకోరు.. కానీ ఇప్పుడు స్వదేశంలో ఇలాంటి యాడ్స్ చేయడం పూర్తిగా నిశ్శబ్దం అని చెప్పాలి ఇప్పుడు రాధిక ఆప్టే ఇలాంటి యాడ్ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు సైతం ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..సభ్య సమాజానికి ఇలాంటి యాడ్స్ చేసి మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది స్వదేశమైనా. విదేశమైనా ఇలాంటివి గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయి.. కదా.. అలాంటిది అమ్మాయిలు తమను రక్షించుకోవడానికి రాధిక ఆప్టే చెప్పింది నిజమే అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. మరి కొంతమంది బాలయ్య బ్యూటీ ఏంటి ఇంత బరితెగించేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా రాధిక ఆప్టే చేసిన ఈ యాడ్ మాత్రం వైరల్ గా మారుతుంది

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు