27 years for Devotional Classic Annamayya: మన్మధుడు మరో అవతారం

27 years for Devotional Classic Annamayya : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఎవరు గ్రీన్ హీరోస్ లో అక్కినేని నాగార్జున ఒకరు. అక్కినేని నాగార్జున కెరియర్లో చాలా లవ్ స్టోరీ సినిమాలు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ వంటి టాలెంటెడ్ దర్శకుడిని కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించిన ఘనత నాగార్జునకు ఉంది. అలానే మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుడు తో పనిచేసే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గీతాంజలి లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాను అందించారు. చాలామంది తెలుగు సినిమా ప్రేక్షకులకు గీతాంజలి ఒక ఫేవరెట్ ఫిలిమ్ అని చెప్పొచ్చు. ఇదే సినిమాను చూసి దర్శకులుగా కూడా తమ ప్రతిభను చూపించుకోవాలి అని ఇప్పుడున్న కొంతమంది దర్శకులు డిసైడ్ అయ్యారు. ఇకపోతే ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్ నాగార్జునకి ఫ్యాన్స్ ఉన్నారు.

27 years for Devotional Classic Annamayya Movie

నాగర్జునతో అన్నమయ్య

అన్నమయ్య కథ విషయానికి వస్తే, 15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించారు. అన్నమయ్య 1997లో విడుదల అయింది. ఈ చిత్రాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం శాసనసభ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడూ అయిన వి.దొరైస్వామి నాయుడు నిర్మించాడు. అన్నమయ్యపై చిత్రాన్ని తియ్యాలని జంధ్యాలతో పాటు అనేకమంది దర్శకులు ప్రయత్నించి విఫలమయ్యారు.చిత్ర కవి ఆత్రేయ 18 పాటలను కూడా నమోదు చేయించి, స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నాడు. కానీ, ఆయన మరణంతో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. జె.కె.భారవి, రాఘవేంద్రరావుల కృషి ఫలితంగా 1997లో అది సాకారం అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి భక్తిరసచిత్రం అన్నమయ్యే. ఈ సినిమాను తమిళంలో అన్నమాచారియర్ గానూ, హిందీలో తిరుపతి శ్రీ బాలాజీగానూ అనువదించి విడుదల చేశారు.

- Advertisement -

విమర్శలతో మొదలైన సినిమా

ఇకపోతే అన్నమయ్య సినిమాను మొదలుపెట్టేటప్పుడు రాఘవేంద్రరావు అప్పటికే కమర్షియల్ సినిమాలు తీసారు. అలానే ఆ టైంలో నాగార్జునకి ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్, అప్పటివరకు నాగార్జున చేసిన లవ్ స్టోరీ సినిమాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వీరిద్దరూ అన్నమయ్య లాంటి సినిమా చేయటం ఏంటి అని చాలామంది అప్పట్లో విమర్శలు చేశారు. కానీ వీటన్నిటికీ భిన్నంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ ప్రశంసలు కురిపించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. సినిమా హిట్ అయిన తర్వాత కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. సినిమాలో అన్నమయ్యకు మీసం ఉంచడం, అన్నమయ్య ఇద్దరు భార్యలతో డ్యూయట్లు పాడటాన్ని చాలామంది అవహేళన చేసి విమర్శించారు. ఈ సినిమాలో సాళువ నరసింహరాయలు పాత్ర పోషించిన మోహన్ బాబు తనదైన సొంతబాణీ డైలాగులతో పాత్రను దిగజార్చారని పలు విమర్శలు వచ్చాయి.

అన్నమయ్య సినిమా సంగీతం

ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు ఇప్పటికి విన్నా కూడా ఈ పాటలు ఒక అద్భుతమైన ఫీల్ ను క్రియేట్ చేస్తాయి. అన్నమయ్య సినిమాలో మొత్తం 41 పాటలు ఉన్నాయి. అందులో చాలామటుకు అన్నమయ్య సంకీర్తనలు కాగా మిగిలినవి సినిమా కోసం వ్రాయబడినవి. యేలే యేలే మరదలా పాటకు ఇంతకుముందు సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని పూసింది పూసింది పున్నాగా అనే పాట బాణీనే మళ్ళీ ఉపయోగించారు. ఇకపోతే ఈ సినిమా నేటితో 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు