Mangalavaram: పాయల్ కంటే అందరి చూపు జమీందార్ భార్య మీదే.. ఎవరామే..?

Mangalavaram: ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో చాలామంది సెలబ్రిటీలు ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఎక్కువమక్కువ చూపుతున్నారు.. జస్ట్ అలా కనిపించి ఇలా వెళ్ళిపోయే పాత్రలను ఈ మధ్యకాలంలో ఏ సెలబ్రిటీ కూడా సెలెక్ట్ చేసుకోవడం లేదు.. నెగటివ్ షేడ్స్ ఉన్నా  పర్వాలేదంటూ చాలామంది హీరోయిన్స్ అలాంటి పాత్రలనే ఎంచుకుంటూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. దీంతో హీరోయిన్స్ కంటే కీలకమైన పాత్రలో నటించే వారే బాగా సక్సెస్ అవుతున్నారు. అలా ఇటీవలే వచ్చిన చిత్రాలలో యానిమల్ సినిమాలో త్రిప్తి , సలార్ చిత్రంలో శ్రియా రెడ్డి తో పాటు తాజాగా పాయల్ నటించిన మంగళవారం సినిమాలో దివ్య పిళ్ళై కూడా ఒకరు అని చెప్పవచ్చు.

RX -100 చిత్రం తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి పాయల్ కాంబినేషన్లో వచ్చిన మంగళవారం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఓటీటీ లో కూడా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో పాయల్ కన్నా ఎక్కువగా జమీందారు భార్యగా నటించిన దివ్యకే భారీ క్రేజ్ ఏర్పడింది.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈమె గురించి కుర్రాళ్ళు సైతం తెగ వెతికేస్తూ ఉన్నారు. సినిమా మొదటిలో చాలా మంచి దానిలా కనిపించి ఊరికే పెద్దదిక్కుగా ఉన్న ఈమె చివరిలో అదిరిపోయే ట్విస్ట్ తో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ ట్విస్ట్ ను ప్రేక్షకులు ఎవరు కూడా ఊహించలేదు.. ఈమె నటనకు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. మునుపెన్నడు లేని విధంగా ఇలాంటి ట్విస్ట్ ప్రేక్షకులను  బాగా ఆకట్టుకుంది. ఈమె నటనకు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఇంతవరకు ఈమెను  చూడలేదని.. ఎవరు ఈమె అన్నట్టుగా  పలువురు ప్రేక్షకులు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.. ఈమె పేరు దివ్య పిళ్ళై.. కేరళ ప్రాంతానికి చెందిన అమ్మాయి.. ఈమె మొదట ఎయిర్  హోస్ట్ గా ఉండేదట. ఒక డైరెక్టర్ ఈమెను ఒక పెళ్లిలో చూసి అవకాశం ఇచ్చారు.

- Advertisement -

2015లో మలయాళంలో నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఆయల్ సంజళ్ల చిత్రంలో నటించింది .ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత పృథ్వీరాజ్ నటించిన ఊజం సినిమాలో నటించింది .ఈ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది ఈ రెండు సినిమాలు పుణ్యమా అంటూ ఖాళీ లేనంత బిజీ యాక్టర్ గా మారిపోయింది.. ఆ తర్వాత తగ్గేదేలే, ది విలేజ్ వంటి సినిమాలలో కూడా నటించింది. ఇక ఇప్పుడు మంగళవారం సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ అందుకుంది .దివ్య పిళ్ళై మంగళవారం సినిమాలో ఇచ్చిన క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలను చేస్తుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు