Dasara: సినిమా ప్లాప్ అయినా పర్వాలేదా?

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్లో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. గతేడాది చివర్లో ‘శ్యామ్ సింగరాయ్’ తో డీసెంట్ హిట్ అందుకున్న నాని.. ఇటీవల ‘అంటే సుందరానికీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ కంటే కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. సినిమా రాంగ్ టైం లో రిలీజ్ అవ్వడం వలనే రిజల్ట్ ఇలా తేడా కొట్టింది అని అంతా అనుకుంటున్నారు .

అయితే ‘అంటే సుందరానికీ!’ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ వలన నాని తర్వాతి చిత్రం ‘దసరా’ బడ్జెట్ ను తగ్గిస్తున్నట్టు కథనాలు పుట్టుకొస్తున్నాయి. నాని కెరీర్లో ఇది హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతుంది. కానీ ఇప్పుడు బడ్జెట్ తగ్గించే పనిలో నిర్మాతలు పడినట్టు కథనాలు మొదలయ్యాయి అంటూ ప్రచారం మొదలైంది. ఈ విషయమై చిత్ర బృందాన్ని ఆరా తీయగా.. అది తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. ‘దసరా’ ని చాలా మనసు పెట్టి చేస్తున్నాం. 40 శాతం షూటింగ్ పూర్తయింది. సినిమా ప్లాప్ అయినా పర్వాలేదు.. మనసు పెట్టే తీస్తాము. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దు అంటూ వారు చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు