మార్చి నెల నుండి చూసుకుంటే సౌత్ లో మూడు ఇండస్ట్రీ హిట్లు నమోదయ్యాయి. మార్చి 25న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఫుల్ రన్లో రూ.1150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.’బాహుబలి2′ కలెక్షన్లను అధిగమించకపోయినా ఈ సినిమా తెలుగు వెర్షన్ పరంగా చూసుకుంటే ఇండస్ట్రీ హిట్ అనే చెప్పాలి. ఇక ఏప్రిల్ 14 న యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని భాషల్లో కలుపుకుని రూ.1200 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కన్నడ వెర్షన్ పరంగా.. ఇది ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది.
ఇక జూన్ 3న తమిళ సినిమా ‘విక్రమ్’ రిలీజ్ అయ్యింది. కమల్ హాసన్ తో పాటు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య వంటి హీరోలు నటించిన సినిమా కావడంతో ఈ మూవీ తమిళంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తమిళ వెర్షన్ పరంగా చూసుకుంటే ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అనే చెప్పాలి. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.370 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఇలా గడిచిన 4 నెలల్లో 3 సౌత్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలబడడం విశేషం.