Kiran Abbavaram: రివ్యూలు ఏం చేశాయి?

అదేంటో కానీ రివ్యూ అనే దాన్ని పైరసీ కంటే కూడా ఘోరంగా చూస్తున్నారు కొంతమంది. ఒక మంచి సినిమాని జెన్యూన్ గా జనాల్లోకి తీసుకెళ్లేది రివ్యూనే..! అలా అని మంచి రివ్యూలు సంపాదించుకున్న సినిమాలకి జనాలు థియేటర్ కు వెళ్తున్నారా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. సినిమాకి ఏర్పడ్డ క్రేజ్ ను బట్టి ప్రేక్షకులు ఆ సినిమాని చూడాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటారు. నెగిటివ్ రివ్యూలు మూటకట్టుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. ఓ సినిమా సక్సెస్ అవ్వడం అనేది ఆ సినిమాకి రిలీజ్ కు ముందు ఏర్పడ్డ హైప్, రిలీజ్ అయిన టైం… ఇవన్నీ కలిసొస్తే రివ్యూ ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తాయి. చిన్న సినిమాలకు మంచి రివ్యూలు పడితే భారీ లాభాలు పొందిన నిర్మాతలు కూడా అనేక మంది ఉన్నారు.

అయితే యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి ఏమనిపించిందో ఏమో.. శుక్రవారం రాసే రివ్యూ.. సోమవారానికి రాయమంటున్నాడు. ఆ మూడు రోజులు సినిమా భవిష్యత్తుని జనాలకి వదిలెయ్యాలట. అతను ఇలా చెప్పడానికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి తన గత సినిమా ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ కి ప్లాప్ టాక్ వచ్చినా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వీకెండ్ కే ఆ చిత్రం చాలా వరకు రికవరీ అయిపోయింది. అయితే సోమవారం నుండీ కలెక్షన్లు పడిపోయాయి. నెగిటివ్ రివ్యూలు కనుక పడకుండా ఉండి ఉంటే ఆ సినిమా అతనికి స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టేది అని అతని స్నేహితుల వద్ద పదే పదే చెబుతున్నాడట ఈ యంగ్ హీరో. నిజానికి ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అనేవి ఆ సినిమా పాటలు హిట్ అవ్వడం వల్ల వచ్చినవే. మరి అతని ‘సెబాస్టియన్’ సినిమాకి ఎందుకు రాలేదు అంటే ఆ సినిమాపై హైప్ లేకపోవడం వల్లనే. మధ్యలో రివ్యూలు ఏం చేశాయి.? పోనీ అతను కోరుకున్నట్టే సోమవారం వరకు రివ్యూలు ఇవ్వడం మానేస్తే.. అతని సినిమా బాగున్నా జనాలకి ఫాస్ట్ గా ఎలా రీచ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు