Sukumar: సుకుమార్ కంటే పూరీనే ముందు

సుకుమార్ ఓ జీనియస్ డైరెక్టర్. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమాలు చేయగలరు. అలాగే ఆయన తన సినిమాల సక్సెస్ మీట్లలో ఎక్కువ శాతం తన యూనిట్ మెంబర్స్ గురించే చెబుతూ ఉంటారు. ‘పుష్ప ది రైజ్’ టైములో తన టీం ఎంత అండగా నిలబడ్డారో చెబుతూ వాళ్లకి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. అంతేకాదు తన దగ్గర ఉన్న కథలతో.. పైగా తన సొంత నిర్మాణంలో తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ ఉంటారాయన. ‘కుమారి 21ఎఫ్’ తో పల్నాటి సూర్య ప్రతాప్ ను.. అలాగే ‘ఉప్పెన’ తో బుచ్చిబాబుని ఆయన దర్శకులుగా పరిచయం చేశాడు. ఇంకా టాలెంట్ ఉన్న తన శిష్యులను దర్శకులుగా నిలబెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

అయితే సుకుమార్ కంటే ముందుగానే పూరి జగన్నాథ్ ఈ పద్దతిని మొదలుపెట్టారు. ‘అనగనగా ఓ కుర్రాడు’ ‘హలో ప్రేమిస్తారా’ ‘బంపర్ ఆఫర్’ ‘రొమాంటిక్’ వంటి చిత్రాలను తెరకెక్కించింది పూరి జగన్నాథ్ శిష్యులే. ఈ సినిమాలకి పూరి స్క్రీన్ ప్లే ను అందించడంలో, నిర్మించడంలో, కథలు అందించడంలో తన శిష్యులకు సాయపడ్డారు. ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్న హరీష్ శంకర్, పరశురామ్ పెట్ల.. వంటి దర్శకులు పూరి వద్ద పనిచేసిన వాళ్ళే కానీ వాళ్ళను దర్శకులను చేసింది ఆయన కాదు. అయితే ఇప్పుడు పూరి కంప్లీట్ గా సుకుమార్ ను ఫాలో అవ్వాలి అని డిసైడ్ అయ్యాడట. వివరాల్లోకి వెళితే.. ఈసారి నిర్మాతగానే కాకుండా.. తన వద్ద ఉన్న కథలు కూడా అందించి తన శిష్యులను వరుసగా దర్శకులుగా తీర్చిదిద్దాలి అని ప్రయత్నిస్తున్నారట పూరి. తాను ఎదగడమే కాకుండా తనను నమ్ముకున్న వారికి కూడా లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పూరి ఈ స్టెప్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు