Akash Puri: ‘ఆ ఇంటర్వ్యూ అంతా ఉత్తుత్తే’

పూరి జగన్నాథ్ కు ప్రభాస్ కు చాలా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ‘బుజ్జిగాడు’ ‘ఏక్ నిరంజన్’ వంటి సినిమాల నుండీ పూరి- ప్రభాస్ మంచి సన్నిహితులు అయిపోయారు. ఓ రకంగా ప్రభాస్ ను అంతా డార్లింగ్ అంటున్నారు అంటే దానికి కారణం మన పూరి అనే చెప్పాలి. అందుకే పూరి అంటే ప్రభాస్ కి ఓ ప్రత్యేకమైన అభిమానం. అందుకే పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. పూరి కొడుకు సినిమా ‘రొమాంటిక్’ ను ఫ్రీ గా ప్రమోట్ చేసి పెట్టాడు. ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడంలో ప్రభాస్ పాత్ర చాలా ఉంది.

ట్రైలర్ ని లాంచ్ చేయడం దగ్గరనుండీ.. హీరో, హీరోయిన్ ని ఇంటర్వ్యూ చేయడం వరకు ప్రభాస్ ఎంతో జోష్ తో కనిపించాడు. ఆ ఇంటర్వ్యూ కూడా చాలా నాచురల్ గా అనిపించింది. ‘ఆ అమ్మాయి బాత్ రూమ్ లో నేనెందుకు ఉంటాను రా.. గజాల పాడు’ ‘ఐ యామ్ ప్రభాస్ ఫ్రమ్ మొగల్తూరు’ అంటూ ప్రభాస్ అనడం చాలా సరదాగా అనిపించాయి. మీమ్ పేజెస్ కు కూడా ఆ ఇంటర్వ్యూ మంచి స్టఫ్ ఇచ్చింది. అయితే ఆ ఇంటర్వ్యూ అంతా స్క్రిప్టెడ్ అని పూరి కొడుకు రివీల్ చేశాడు. తన తండ్రి పూరి జగన్నాథ్ ఆ ఇంటర్వ్యూని డైరెక్ట్ చేసినట్లు… అందుకే అది అంత నేచురల్ గా వచ్చింది అంటూ అతను చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు