Deepika Padukone : ఫ్రీగా నటిస్తుందా ?

బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో దీపిక పదుకొనె కూడా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రణ్ వీర్ సింగ్ ను పెళ్ళాడిన తర్వాత హవా కాస్త తగ్గింది. అలా అని పారితోషికం విషయంలో కాదు. రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అన్నట్టు వ్యవహరిస్తోంది. ఒక్కో సినిమాకు దీపిక పదుకొనె 10 కోట్ల నుండి 15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్న సంగతి బహుశా తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా తెలిసుండదు. బాలీవుడ్ హీరోయిన్లలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతుంది దీపిక. అయితే దీపిక స్నేహితులు ఎవరైనా తమ సినిమాల్లో అతిథి పాత్రలు చేయమని కోరితే, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా చేసి పెడుతుంటుందనే వార్త ఎప్పటి నుండో చర్చల్లో ఉంది.

ఇప్పుడు మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ కోసం ‘బ్రహ్మస్త్ర’ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తుంది దీపిక పదుకొనె. అలాగే గురువు షారుఖ్ ఖాన్ కోసం ‘జవాన్’లో కూడా ఈమె అతిథి పాత్ర పోషించనుందని వినికిడి. రణబీర్, షారుక్ లు కాబట్టి ఇప్పుడు తనకున్న బిజీ షెడ్యూల్ లో కూడా అతిథి పాత్రలు చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్టు కె’ లో హీరోయిన్ గా నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు