Megastar : పండుగలతో సేఫ్ ?

మెగాస్టార్ చిరంజీవి గురించి, క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 10 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా అదే క్రేజ్ ను కంటిన్యూ చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. ‘బాహుబలి ది బిగినింగ్’ తర్వాత రూ.100 కోట్ల షేర్ అందుకున్న మూవీగా ‘ఖైదీ నెంబర్ 150’ నిలిచింది. దీంతో చిరు పదేళ్లు గ్యాప్ తీసుకున్నా, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతుంది. అయితే క్రేజ్ పరంగా ఎలా ఉన్నప్పటికీ, ఇప్పుడు చిరు నటిస్తున్న సినిమాలపై అటు కామన్ ఆడియన్స్ లో కానీ, ఇటు అభిమానుల్లో కానీ అంచనాలు పెద్దగా లేవు. ‘ఆచార్య’ కు ముందు వరకు కాస్తో కూస్తో ఉన్నా, ‘ఆచార్య’ రిజల్ట్ తో బాగా తగ్గిపోయాయి.

దీంతో ఇప్పుడు సినిమాలను పండుగ సీజన్ లో దింపి సేఫ్ అయిపోవాలని చిరు భావిస్తున్నారు అనిపిస్తుంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరు నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ ను దసరా కానుకగా విజయదశమి రోజున రిలీజ్ చేయబోతున్నారు అని కన్ఫర్మ్ చేశారు. ఇక బాబీ దర్శకత్వంలో చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య'(వర్కింగ్ టైటిల్) ను 2023 సంక్రాంతి రేసులో దింపనున్నట్లు కూడా ఈ మధ్యనే ప్రకటించారు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటిస్తున్న ‘భోళా శంకర్’ ను 2023 ఉగాది కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు భోగట్టా. మరి చిరుకు పండుగలు ఎంత వరకు కలిసొస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు