#RC15: హైప్ పెరుగుతోంది

దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
భారీ బడ్జెట్ లో సినిమాలను తెరకెక్కించి సౌత్ సినిమా రేంజ్ ను పెంచిన దర్శకుడు. శంకర్ తమిళ్ లో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగులో కూడా డబ్ కావడం వలన తెలుగు ప్రేక్షకులుకు సుపరిచితుడే.

శంకర్ కెరియర్ లో ఫస్ట్ టైం ఒక డైరెక్ట్ తెలుగు సినిమాను చేస్తున్నాడు.
అది రామ్ చరణ్ తేజ్ తో, వాస్తవానికి కొన్నేళ్లు క్రితం రోబో సినిమా ప్రొమోషన్స్ లో మెగాస్టార్ మాట్లాడుతూ శంకర్ తో తనకు సినిమా చెయ్యాలని ఉందని చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ , దర్శకుడు శంకర్ కి మధ్య మంచి సన్నిహితం ఉంది కాబట్టి ఏదైనా కథ ఉంటే చెప్పు రజిని అని చిరంజీవి రజినికాంత్ ను అడిగారు.
ఈ విషయాన్ని అప్పట్లో వేదికపై చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి, శంకర్ కాంబినేషన్ కుదర్లేదు, కానీ ఆ అవకాశం మెగావారసుడుకి వచ్చింది. రామ్ చరణ్ చేస్తున్న 15వ చిత్రమిది. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రీసెంట్ గా రిలీజైన చరణ్ లుక్ కూడా తెగ వైరల్ అయింది. #RC15 విషయంలో ఎక్కడా రాజీ పడకుండా శంకర్ స్థాయిలోనే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. #RC15 పై వస్తున్న ప్రతి అప్డేట్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు