Chiranjeevi vs Balakrishna : చిరు వర్సెస్ బాలయ్య ?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం కొత్తేమీ కాదు. గతంలో నువ్వా నేనా అన్నట్టు తలబడేవారు ఈ అగ్ర హీరోలు. చాలా కాలం గ్యాప్ తర్వాత 2017లో ‘ఖైదీ నెంబర్ 150’ తో మెగాస్టార్ చిరంజీవి, ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ తో బాలయ్య పోటీపడ్డారు. అయితే ఆ టైములో వార్ వన్ సైడ్ అయిపోయింది. చిరు కమ్ బ్యాక్ మూవీ కావడం, బాలయ్య మూవీ సంక్రాంతి సీజన్ కు తగ్గట్టు లేకపోవడంతో, బాలయ్య పై మెగాస్టార్ పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. అలా అని ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ తక్కువగా ఏమీ కలెక్ట్ చేయలేదు. ఆ చిత్రం బాలయ్య కెరీర్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాలో ఒకటిగా నిలిచింది.

తాజాగా ఈ అగ్ర హీరోలు మరోసారి బాక్సాఫీస్ వద్ద బస్తీ మే సవాల్ అంటూ తలపడబోతున్నట్టు తెలుస్తుంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరు నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ దసరాకి రిలీజ్ కానుందని తెలుస్తోంది. అదే సీజన్ కు బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్బీకే 107ను కూడా రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తుంది. చిరు ‘గాడ్ ఫాదర్’ నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు. కానీ, బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి హైప్ ను కూడా క్రియేట్ చేసింది. ఈ రెండు సినిమాలు అన్నీ పనులు పూర్తి చేసుకుని, దసరా బరిలో ఉంటే, బాక్సాఫీస్ పోరు ఓ రేంజ్ లో ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు