ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా, ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఇందులో కొరటాల శివ దర్శకత్వంలో NTR30, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 ప్రకటనలు వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా, ఈ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చాయి. తారక్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వస్తుంది.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ తో సినిమా చేయాలని దాదాపు ఏడాది నుండి ఎదురుచూస్తున్నాడు ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు. అది కూడా ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లోనే. కానీ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఆ బ్యానర్లో సెట్ అవ్వడంతో ఇక ఎన్టీఆర్-బుచ్చిబాబు ల మూవీ లేదని అంతా ఫిక్స్ అయిపోయారు.
కానీ, ఇన్సైడ్ టాక్ వేరేలా ఉంది. ఎన్టీఆర్ – బుచ్చిబాబు ల ప్రాజెక్టు ఉంటుందట. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైన తర్వాత బుచ్చిబాబుతో చేయాల్సిన సినిమా గురించి ఆలోచించాలని తారక్ నిర్ణయం తీసుకున్నాడట. ఆ సినిమా అప్ డేట్ కూడా అదే సమయంలో వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. అయితే ఈ సినిమాను ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మిస్తుందా ? లేదా, ‘వైజయంతి మూవీస్’ నిర్మిస్తుందా ? అన్నది తెలియాల్సి ఉంది.
నిజానికి ‘వైజయంతీ మూవీస్’ తో తారక్ ఓ సినిమా చేస్తానని చెప్పాడట. ఈ ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీని ఫిక్స్ కూడా చేశాడని అప్పట్లో వినిపించింది. అయితే ప్రస్తుతం అట్లీ, షారుఖ్ ఖాన్ తో జవాన్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అట్లీ ప్లేస్ ను బుచ్చిబాబు తో రీప్లేస్ చేసే ఆలోచనలో వైజయంతీ మూవీస్, తారక్ ఉన్నట్టు తెలుస్తుంది.