Chaitanya Krishna:నందమూరి కుటుంబం నుంచి మరో హీరో

ఇండస్ట్రీ లోకి స్టార్స్ ఫ్యామిలీ నుంచి వారసులు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అయితే సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి ఇప్పటికే పలువురు హీరోలుగా వచ్చారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు హీరోలుగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫమ్ అయిపోయింది. తాజాగా నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. బసవతారకరామ క్రియేషన్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థల నెలకొల్పిన ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.

గతంలో రక్ష, జక్కన్న వంటి సినిమాలను తెరకెక్కించిన వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. నందమూరి బాలకృష్ణ లాంచ్ చేసిన ఈ మూవీ టైటిల్ ని మార్చి 5వ తేదీన రిలీజ్ చేసారు.

ఈ సినిమాకి బ్రీత్ అనే టైటిల్ ను ఖరారు చేసి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు. అంతిమ పోరాటం అనేది ట్యాగ్ లైన్. రిలీజ్ చేసిన పోస్టర్ లో చైతన్య కృష్ణ వర్షంలో గొడుగు పట్టుకుని ఉన్న ఇంటెన్స్ లుక్ గమనించవచ్చు. 2003లో తెలుగులో విడుదలైన దమ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు నందమూరి చైతన్య కృష్ణ. కానీ ఆ తర్వాత వ్యాపారంలో బిజీ అయిపోయాడు. ఈ చిత్రంలో కృష్ణ చైతన్య ఓ కీ రోల్ పోషించాడు. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత హీరోగా పరిచయం కానున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు