Operation Valentine: హిట్టు సినిమాలకి క్రెడిట్ లేదు… ప్లాప్ సినిమాలకి నిందలు తప్పడం లేదు

మెగా కంపౌండ్ నుంచి వచ్చిన ప్రతీ హీరోకు ఓ గుర్తింపు వచ్చింది. మొన్నటికి మొన్న వచ్చిన పంజా వైష్ణవ్ కి కూడా చెప్పుకోవడానికి ఉప్పెన లాంటి ఓ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ఉంది. తర్వాత వచ్చిన సినిమాలను కాస్త పక్కన పెడితే, వైష్ణవ్ తొలి మూవీనే 100 కోట్లు అని ఇప్పటికీ చెబుతున్నారు. అయితే ఇదే మెగా కంపౌండ్ నుంచి వచ్చి, మెగా ప్రిన్స్ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్ దక్కించుకున్న వరుణ్ తేజ్‌కి మాత్రం ఆ అదృష్టం లేదు.

పాపం ఈ మెగా హీరో ఇప్పటి వరకు 12 సినిమాలు చేశాడు. అందులో హిట్స్ కూడా ఉన్నాయి. కానీ, ఏం లాభం ఆ గుర్తింపు మాత్రం మన మెగా ప్రిన్స్‌కి రాలేదు.

బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఫిదా మూవీ క్రెడిడ్ మొత్తం హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి కొట్టేసింది. లేడీ సూపర్ స్టార్ అయిపోయింది.

- Advertisement -

తొలి ప్రేమ కూడా ఓ మాదిరి హిట్టే. కానీ, ఈ సినిమాలో కూడా క్రెడిట్ హీరోయిన్‌కే వెళ్లింది.

ఇక కామెడీ జానర్ అంటూ F2 & F3 సినిమాలు చేశాడు. కానీ, ఈ రెండు సినిమాల్లోనూ వరుణ్ తేజ్ సైడ్ క్యారెక్టర్ అంటూ ట్రోల్స్ వచ్చాయి. మెయిన్ క్రెడిట్ మొత్తం వెంకీ మామకు, కొంత వరకు డైరెక్టర్ అనిల్ రావిపూడికి వెళ్లింది. కొన్ని ఇంటర్వ్యూల వల్ల నిర్మాత దిల్ రాజుకు కూడా క్రెడిట్ దక్కింది. కానీ, మన మెగా ప్రిన్స్‌ కెరీర్ పరంగా F2 & F3 పెద్దగా యూజ్ అవ్వలేదు.

మధ్యలో గద్దలకొండ గణేష్ అనే మూవీ చేశాడు. ఈ సినిమా మంచి హిట్ అయితే అయింది. కానీ, ఎప్పటిలాగే… సినిమా హిట్ అనేది కేవలం హీరో వల్లే అనే టాక్ అయితే తెచ్చుకోలేకపోయాడు. ఈ మూవీ సక్సెస్ అవ్వడానికి ఏకైక కారణం డైరెక్టర్ హరీష్ శంకర్ అంటూ ముక్త కంఠంగా వినిపించిన సంగతి తెలిసిందే.

ఎలాగైన క్రిడెట్ కొట్టేయాలని చాలా కష్టపడి… కండలు పెంచేసి, బాక్సింగ్ నేర్చుకుని మరీ గని అనే ఓ మూవీ చేశాడు. కానీ, ఆ మూవీ ఎలా ఆడిందో మళ్లీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఫెయిల్ అయింది అంటూ మెగా ప్రిన్స్ స్వయంగా ఒప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇంత జరిగినా, వరుణ్ తేజ్‌కు క్రెడిట్ కొట్టేయాలనే ఆశ అయితే పోలేదు. అందుకే ఓ టఫ్ స్టోరీని తీసుకుని పాన్ ఇండియా మూవీ చేయ్యాలని అనుకున్నాడు. అలా వస్తుందే ఆపరేషన్ వాలెంటైన్ మూవీ. ఈ సినిమాతో అయినా, తనకు కావాల్సిన క్రెడిట్ కొట్టేసి… తన వల్లే ఈ సినిమా హిట్ అయింది అని చెప్పుకోవడానికి తెగ ట్రై చేస్తున్నాడు. అందుకే ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడు. మరీ ఆపరేషన్ వాలెంటైన్… వరుణ్ తేజ్ కి క్రెడిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు