Bigg Boss Punarnavi : టాప్ లెస్ ఫోటోలు పోస్ట్ చేసిన పున్ను… ఇది కదా కావాల్సింది

పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉయ్యాల జంపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పిట్టగోడ వంటి చిత్రాల్లో మెరిసిన పునర్నవి సినీ ప్రియులకు దగ్గర అయింది. ఆ తర్వాత పునర్నవి పాపులర్ బుల్లితెర షో బిగ్ బాస్ లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది.

బిగ్ బాస్ తో ఈ ముద్దుగుమ్మకు బాగానే క్రేజ్ వచ్చింది. హౌస్ లో సింగర్ రాహుల్ తో ఈ బ్యూటీ ఆడిన లవ్ డ్రామా వల్ల భారీగా క్రేజ్ పెరిగింది. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో మునిగిపోయారు అని అందరూ భ్రమ పడిపోయేంతగా నటించారు. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈ జంట ఎక్కువగా కలిసి కనిపించలేదు. అలాగే ఎక్కడైనా కనిపించినా తమిదరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత ఓ పబ్ లో వీరిద్దరికి సంబంధించిన గొడవ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు సినిమాల నుంచి ఆఫర్లు వచ్చినా పునర్నవి రిజెక్ట్ చేసింది అనే టాక్ కూడా నడిచింది.

ఆ విషయాలన్నీ పక్కన పెట్టి పునర్నవి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోయింది. సైకాలజీలో పీజీ చేస్తూ విదేశాల్లో ఉంటున్న పునర్నవి సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పునర్నవి అక్కడే ఓ వ్యక్తితో లవ్ లో ఉందనే రూమర్స్ ట్రెండ్ అయ్యాయి. దీంతో తనమీద పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారంటూ మండిపడింది పునర్నవి. ఇక రీసెంట్ గా రాహుల్ చేసిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ ను పునర్నవి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

తాజాగా పునర్నవి అర్థనగ్న ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం నెటిజన్లు ఆమె ఫోటోల షేర్ చేస్తూ ఉండడంతో అవి వైరల్ అవుతున్నాయి. చుట్టూ బుక్స్ ఉండగా వాటి మధ్యలో టాప్ లెస్ గా కూర్చుని కన్పిస్తోంది పునర్నవి. కొంతమంది ఇలా అర్ధనగ్న ఫోటోలు పోస్ట్ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు పున్ను అని ప్రశ్నిస్తుంటే, మరి కొంతమంది మాత్రం ఇది కదా కావాల్సింది అంటూ ఆ ఫోటోలను చూస్తూ పండగ చేసుకుంటున్నారు. మరి ఈ బ్యూటీ పైచదువులు పూర్తయ్యాక సినిమాల్లోకి వస్తుందా? లేక ప్రొఫెషనల్ కెరీర్ అంటూ అటువైపే వెళ్లిపోతుందా? అనేది చూడాలి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు