Tollywood: ముసలోడితో సినిమానా..? చిరంజీవిని అవమానించిన ఎన్టీఆర్ హీరోయిన్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్ హీరోలు ఇప్పటి యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోలు ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం మనకు తెలిసిందే. ఆరు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ అదే ఊపుని మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నటీమణులు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటున్నారు.

కానీ మన సీనియర్ హీరోలు మాత్రం ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లతో డ్యూయెట్ పాడేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు కొంతమంది యంగ్ హీరోయిన్లు ఒప్పుకుంటున్నప్పటికీ.. మరికొందరు మాత్రం రిజెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిందట ఓ యంగ్ హీరోయిన్. ఆ హీరోయిన్ మరెవరో కాదు అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వి కపూర్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం జాన్వి కపూర్ ని అనుకున్నారట దర్శకుడు వశిష్ట. ఈ విషయాన్ని బోనీ కపూర్ కి చెప్పగా.. బోనీకపూర్ జాన్వికి ఎక్స్ప్లెయిన్ చేశారట. కానీ జాన్వి మాత్రం.. ” పోయి పోయి ముసలోడితో సినిమా చేయమంటున్నావు ఏంటి డాడీ..? ” అని బోని కపూర్ పై ఫైర్ అయ్యిందట. ఇలా జాన్వి మాటలతో బాధపడిపోయిన బోనీ కపూర్ ఈ సినిమాని క్యాన్సల్ చేసేసారట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో లీక్ అయిందంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. దీంతో జాన్విపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు మెగా అభిమానులు.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు