Rashmika – Vijay Deverakonda : సేమ్ స్వెట్ షర్ట్స్… మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన లవ్ బర్డ్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ… వీళ్లిద్దరికీ సంబంధించి ఎలాంటి న్యూస్ బయటకు వచ్చినా క్షణంలో వైరల్ అవుతుంది. గత కొంత కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ లో ఉన్నారని రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయం గురించి వీరిద్దరూ స్పందించలేదు, అలాగని క్లారిటీ కూడా ఇవ్వట్లేదు. ఈ రూమర్ వల్ల వస్తున్న క్రేజ్ ని ఉపయోగించుకుంటున్నారు. వీళ్లిద్దరి రిలేషన్షిప్ న్యూస్ ఎంత వరకు నిజమో తెలియదు కానీ మీడియా, నెటిజన్ల దృష్టి మొత్తం ఈ లవ్ బర్డ్స్ పైనే ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నారు? అనే విషయాన్ని ఎప్పుడూ ఓ కంట గమనిస్తూనే ఉన్నారు.

దీంతో ఎప్పటికప్పుడు రష్మిక, విజయ్ దేవరకొండ అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. పలు సాక్ష్యాలను బయట పెట్టి, వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అనడానికి ఇవే రుజువులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలా ఇప్పటివరకు వీళ్ళిద్దరికీ సంబంధించిన చాలా ఫోటోలు బయటకు రాగా, వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి దొరికిపోయారు ఈ సెలబ్రిటీ జంట. రష్మిక హీరోయిన్ గా నటించిన “యానిమల్” మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ముంబై విమానాశ్రయంలో కనిపించిన రష్మిక తన ప్రియుడు విజయ్ దేవరకొండ ‘రౌడీ’ బ్రాండ్ కి చెందిన స్వెట్ షర్ట్ ధరించి కనిపించింది. క్రీమ్ కలర్ లో ఉన్న సేమ్ స్వెట్ షర్ట్ ని హైదరాబాదులో ఉన్న విజయ్ దేవరకొండ కూడా ధరించి కనిపించాడు.

తెలంగాణలో జరుగుతున్న ఎలక్షన్స్ లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ ఈరోజు రష్మిక ధరించిన సేమ్ షర్ట్ ధరించి కనిపించాడు. వీళ్ళిద్దరూ ఒకే రోజు, ఒకే స్టైల్, ఒకే రంగు ఉన్న సేమ్ స్వెట్ షర్ట్ ధరించడంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లవర్స్ ఎక్కువగా ఇలాంటివి ఫాలో అవుతుంటారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్” షోలో కూడా వీళ్ళిద్దరి గురించిన ప్రస్తావన వచ్చింది. మరి రష్మిక, విజయ్ దేవరకొండ తమ రిలేషన్షిప్ గురించి ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో వేచి చూడాలి. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ మూవీ షూటింగ్ దశలో ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు