RC 16: సామాన్యులకు శుభవార్త.. చెర్రీ మూవీలో నటించే ఛాన్స్..!

RC 16

గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శంకర్ అటు కమలహాసన్ తో భారతీయుడు 2 సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉండడంతో.. రామ్ చరణ్ సినిమా కాస్త ఆలస్యం అవుతోంది. దీంతో రాంచరణ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన 16వ సినిమాని చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో నిర్మాతలు కీలక అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాంచరణ్ 16వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్టు కోసం కొత్త నటీనటులకు అవకాశం కల్పించబోతున్నారు. అందుకోసం ఆడిషన్స్ ని కూడా నిర్వహించనున్నారు. తాజాగా ఈ ఆడిషన్స్ కోసం ఒక పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఆ పోస్టర్ కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో నడిచే విలేజ్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం.

ఇక ఈ క్రమంలోనే అక్కడి స్థానిక నటుల కోసం వేట మొదలైంది.. చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు అన్ని ఏజ్ గ్రూప్స్ కి చెందిన వారు ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు అని తెలియజేశారు. కాబట్టి రాంచరణ్ సినిమాలో నటించాలని కోరుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. మరోవైపు ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 17 వరకు సాలూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఆడిషన్స్ జరగనున్నాయి. ఇక మీరు కూడా సినిమాలో నటించాలనే కలతో ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిత్ర బృందం పిలుపునిచ్చింది.

- Advertisement -

Auditions for Ram charan's 16th film

డైరెక్టర్ విషయానికి వస్తే.. ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు బుచ్చిబాబు సనా.. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడుగా కూడా పేరు తెచ్చుకున్న ఈయన.. ఏకంగా రెండవ చిత్రంతోనే రామ్ చరణ్ వంటి టాప్ హీరోతో ఛాన్స్ కొట్టేయడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు సమాచారం. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఆడిషన్స్ కి సిద్ధం కండి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు