Ante Sundaraniki : అయోమయంలో “సుందరం”

కోటి విద్యలు కూటి కోసం అంటారు. ఆ కోటి విద్యలల్లో సినిమా కూడా ఓ విద్యే. అటు నిర్మాతలు, డైరెక్టర్లు, ఇటు నటీ నటులు తాము చేస్తున్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని, బాగా కలెక్షన్లు రావాలని కోరుకుంటారు. దీంతో పాటు మంచి పేరు కూడా రావాలని అనుకుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో డబ్బులు బాగా వచ్చిన సినిమానే హిట్. ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు ఎక్కువగా రాకుంటే, అది ప్లాప్ అయినట్టే.

ఒక సినిమాకు కలెక్షన్లు ఎక్కువగా రావాలంటే, ప్రేక్షకులు మెచ్చే కథతో పాటు, టికెట్ల ధరలు కూడా పరిగణలోకి వస్తుంది. గత కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ల ధరల గురించి ఎంత రాద్ధాంతం జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా రోజుల హైడ్రామా తర్వాత ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెద్ద సినిమాలకు మొదటి పది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది.

అప్పటి నుండి ప్రతి సినిమా విడుదలకు ముందు టికెట్ ధరలను పెంచాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం ఆనవాయితీగా మారింది. కానీ ఇటీవల సీన్ మారింది. టికెట్ల ధరలను పెంచడం కాకుండా, తగ్గించడానికి సినీ నిర్మాతలు ఒకరిని మించి ఒక్కరు కష్టపడుతున్నారు. ఎఫ్3 సినిమా నుండి ఇది స్టార్ట్ అయింది.

- Advertisement -

ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ తీసుకురావడానికి టికెట్ల ధరలను పెంచకుండా సాధారణ ధరలనే కేటాయించారు ఎఫ్ 3 నిర్మాత దిల్ రాజు. దీని వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులు కొంత వరకు థియేటర్స్ కు వచ్చినా, అనుకున్నంత సక్సస్ కాలేకపోయింది. అలాగే ఎఫ్ 3ని ఆదర్శంగా తీసుకున్న మేజర్ సినిమా కాస్త ముందడుగు వేసి, ఏకంగా టికెట్ల ధరలనే తగ్గించింది. దీంతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, ఎక్కువ మంది థియేటర్స్ వచ్చినా, అనుకున్నంత కలెక్షన్లు మాత్రం సాధించలేక పోయింది.

ఈ రెండు సినిమాల అనుభవాన్ని దగ్గర నుండి చూసిన “అంటే సుందరానికి” బృందం అయోమయంలో పడినట్టు తెలుస్తుంది. మేజర్ ను ఫాలో అయి టికెట్ ధరలను తెగ్గించాలా..? లేదా ఎఫ్ 3 చేసినట్టు సాధారణ ధరలకే టికెట్లు ను అందుబాటులో ఉంచాలా..? అని తెగ ఆలోచిస్తున్నారట. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా మరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు