AnteSundaraniki: కారణం ఇదేనా.?

పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీమేక్ లతో రికార్డ్స్ కొట్టగలిగే హీరో పవర్ స్టార్. పవన్ క్రేజ్ ను బేస్ చేసుకుని చాలా సినిమాలలో డైరెక్టర్లు రిఫరెన్స్ గా చూపించారు. మాములుగా ప్రేక్షకులకు అభిమాన హీరోలు ఉండటం సహజం. కానీ హీరోలకే అభిమాన హీరో గబ్బర్ సింగ్.

నితిన్ వరుస ఫ్లాప్స్ సతమతమవుతున్న టైంలో నితిన్ నటించిన ఇష్క్ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఆ సినిమా ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ అతిధిగా రావడంతో, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నితిన్ ను ఓన్ చేసుకున్నారు, ఇష్క్ సినిమాకి బ్రహ్మరథం పట్టి నితిన్ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ను అందించారు అనేది చాలామంది అభిప్రాయం. అప్పటినుండి నితిన్ సినిమాకి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వెళ్లడం సాధారణ విషయం అయింది.

ఇక అసలు విషయానికి వస్తే కొన్ని రోజులు క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్స్ అతి తక్కువగా ఉన్న టైములో
పవన్ కళ్యాణ్ మినహా ఏ హీరో కూడా టికెట్స్ రేట్లు గురించి మాట్లాడలేదు అనేది చాలామంది వాదన. ఆ టైంలోనే నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” సినిమా కూడా రిలీజ్ కు రెడీ గా ఉంది, ఆ ప్రొమోషన్స్ లో భాగంగా ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు
నాని సమాధానంగా చెప్పిన మాటలు కొందరు వైసీపీ నాయకులకి
ఆగ్రహాన్ని తెప్పించాయి, ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు నానికి సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్స్ చేసారు. “రిపబ్లిక్” ప్రీ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కూడా నాని గురించి పాజిటివ్ గా మాట్లాడి సపోర్ట్ గా నిలిచారు.

- Advertisement -

నాని లేటెస్ట్ మూవీ “అంటే సుందరానికి” జూన్ 10న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఈ మూవీ టీం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుంది, దీనికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. పెద్దగా ఫంక్షన్స్ కి హాజరుకాని పవన్ కళ్యాణ్ నాని సినిమా కోసం రావడానికి ముఖ్య కారణం టికెట్ రేట్స్ విషయంలో నాని మాట్లాడటం. అలానే ఈ సినిమాని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ లోనే పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని చేయడం కూడా కారణం అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు