Chiranjeevi : ఒక్క ప్లాప్ కి చిరు అంత ఇబ్బంది పెట్టేస్తున్నారా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఇటీవల విడుదలై దారుణమైన ప్లాప్ ను ముటగట్టుకుంది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. రాంచరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ముందు దర్శకుడు కొరటాల శివకి ఒక్క ప్లాప్ కూడా లేదు. పైగా ఆయన మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు కూడా..! అయినా ఎక్కడో తేడా కొట్టింది. ఏది ఏమైనా, ‘హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో ఉన్న కమెడియన్ ను చంపేసినట్టు’ అనే ‘అత్తారింటికి దారేది’ అనే డైలాగ్ లాగా కొరటాల ప్లాప్ ఇస్తే పాపం కష్టం అంతా మోహన్ రాజా, మెహర్ రమేష్ ల పై పడిందట.

మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ వంటి చిత్రాలు చేస్తున్నారు చిరు. ఈ చిత్రాల షూటింగ్ కూడా చాలా వరకు అయిపోయాయి. కానీ ‘ఆచార్య’ రిజల్ట్ తో మళ్ళీ ఈ చిత్రాల రషెస్ చూసిన చిరు మార్పులు కోరుతున్నారట. ఈ రెండు సినిమాల్లోనూ చిరు.. 40 శాతం వరకు మార్పులు కోరుతున్నట్టు వినికిడి. పోనీ దర్శకులతో డిస్కస్ చేసి వెంటనే ఓకే చేస్తున్నారా అంటే అదీ లేదు. కె.రాఘవేంద్ర రావు, పరుచూరి గోపాలకృష్ణ లతో చర్చలు జరిపి కానీ ఏ విషయం కూడా తొందరగా దర్శకులకి చెప్పడం లేదు అని వినికిడి. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్టార్ డమ్ అంతా ఇంత కాదు. ఆచార్య లాంటి ఒక్క ప్లాప్ చిరుకు ఉన్న ఇమేజ్ ఏ మాత్రం తగ్గకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు