RRR : మ‌రో ఛాన్స్

ఆస్కార్ అవార్డుకు ఆర్ఆర్ఆర్ సినిమా సెలెక్ట్ అవుతుంద‌ని మ్యాగిజైన్‌సైతం ప్ర‌క‌టించింది. కానీ ఆస్కార్ రేసులో ఇండియా చేసుకున్న ఫిల్ట‌ర్‌లోనే వ‌డ‌పోత‌లో కొట్టుకుపోయింది. ఎవ్వ‌రూ ఊహించ‌ని, ఎవ‌రికీ తెలియ‌ని గుజ‌రాతి సినిమా ‘చెహెల్లో షో’ ఆస్కార్ అవార్డుకి భార‌త్ త‌రుపున ఎంపికైంది. ఇండియ‌న్ అఫిషియ‌ల్ ఆస్కార్ ఎంట్రీగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో ఆ సినిమా ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా స్క్రీనింగ్ క‌మిటీని నిందిస్తున్నారు. క‌మిటీది త‌ప్పుడు నిర్ణ‌యం అని పేర్కొంటున్నారు. భార‌త్ త‌రుపున గుజ‌రాతి సినిమా ‘చెహెల్లో షో’ ఎంపికైంది. ఇక ఈ మూవీ టైటిల్‌ను ఇంగ్లీషులో ‘లాస్ట్ ఫిల్మ్ షో’ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల పోటీని త‌ట్టుకుని ఈ చిత్రం భార‌త్ త‌రుపున ఆస్కార్ బ‌రిలోకి వెళ్తుండ‌డం గ‌మ‌నార్హం. ఒక బ‌యోగ్ర‌ఫిక‌ల్ డ్రామాగా ఆస్కార్‌లో ఇండియాకి ప్రాతినిథ్యం వ‌హించ‌బోతుంది.

అయిన‌ప్ప‌టికీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో మ‌రో ఛాన్స్ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆస్కార్స్ సెల‌క్ష‌న్లు దాదాపు డిసెంబ‌ర్ వ‌ర‌కు స‌మ‌యం ఉండ‌డంతో ‘ఆర్ఆర్ఆర్‌’కి మ‌రో ఛాన్స్ ఉంది అని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కొన‌సాగుతుంది. గ‌త ఏడాది భార‌త్ త‌రుపున త‌మిళ సినిమా ‘జై భీమ్’ పోటీలో నిలిచింది. ఈ చిత్రం ఆస్కార్స్ పై చాలా ఆశ‌లే పెట్టుకుంది. అయితే చివ‌రగా ఆస్కార్ అవార్డు అందుకోలేక‌పోయింది.

- Advertisement -

ఈసారి కేవ‌లం ‘చెహెల్లో షో’ సినిమానే ప్ర‌క‌టిస్తారా..? లేక ఆర్ఆర్ఆర్ కి మ‌రో ఛాన్స్ ఇస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. జ‌న‌ర‌ల్ క్యాటగిరిలో ఆర్ఆర్ఆర్‌ని సెల‌క్ట్ చేసే ఛాన్స్ ఉండ‌డంతో ఆర్ఆర్ఆర్‌ని సెలెక్ట్ చేస్తారో లేక మ‌రేదైనా సినిమాను చేస్తారో అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ పై అభిమానులు పెట్టుకున్న ఆశ‌ల‌న్ని అడిఆశ‌ల‌య్యాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఏం జ‌రుగుతుంద‌నేది వేచి చూడాలి మ‌రి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు