Animal : ఇతని టార్చర్ ని ఆడియన్స్ భరించగలరా?

“అర్జున్ రెడ్డి” సినిమాతో టాలీవుడ్ ను షేక్ చేసి, అదే సినిమాను “కబీర్ సింగ్” పేరుతో హిందీలో రీమేక్ చేసి మళ్లీ బ్లాక్ బస్టర్ కొట్టిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ యంగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ “యానిమల్”తో మరోసారి తనలో ఉన్న వయోలెన్స్ ఏంటో ప్రేక్షకులకు చూపించడానికి త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్నాడు. అసలైన వయోలెన్స్ ఏంటి అనేది “యానిమల్” సినిమాతో చూపిస్తానని గతంలో స్టేట్మెంట్ ఇచ్చిన సందీప్ తన మాటను నిలబెట్టుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, తాజాగా బయటకొచ్చిన ట్రైలర్ చూస్తుంటే ఇదొక ఇంటెన్స్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

“యానిమల్” సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించగా, రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోంది. మరో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. యానిమల్ సినిమా రన్ టైం ముందుగా మూడు గంటల 40 నిమిషాలు అని అనుకున్నారట. సినిమా నిడివి ఎక్కువగా ఉండడంతో రెండు ఇంటర్వెల్స్ వేస్తె ఆడియన్స్ కు రిలీఫ్ గా ఉంటుందని అనుకున్నారట. అయితే ఫైనల్ డిస్కషన్ లో మాత్రం సినిమాను 3 గంటల 21 నిమిషాలకి లాక్ చేయడంతో ఒకే ఇంటర్వెల్ కి ఫిక్స్ అయిపోయారట.

ఇక ఇంటర్వెల్ సంగతి ఎలా ఉన్నా 3 గంటల 21 నిమిషాల సినిమా అంటే చాలా కష్టం. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కూడా మూడు గంటలలోపే ఉంటుంది. కానీ ఈ మూవీ దాదాపుగా మూడున్నర గంటలు ఉండడం అనేది ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే అంశం. అంతసేపు ప్రేక్షకులు థియేటర్లలో కూర్చుంటారా? ఒకవేళ సినిమా ఎంత బాగున్నప్పటికీ సందీప్ ఈ “యానిమల్”లోని వయోలెన్స్ ను, హీరో విలన్లను పెట్టే టార్చర్ ను అంత సేపు థియేటర్లలో ఆడియన్స్ భరిస్తారా ?

- Advertisement -

అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి సినిమాకు ఇంత పెద్ద రన్ టైం అనేది మేకర్స్ తీసుకున్న డేరింగ్ స్టెప్. అయితే ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా తీసుకుంటారో చూడాలి. ఒకవేళ సందీప్ తన టాలెంట్ తో ప్రేక్షకులను మూడున్నర గంటలు సీట్లలో అతుక్కుపోయేలా చేస్తే మాత్రం ఆయనను ఇకపై ఎవరూ ఆపలేరు. లేదు అంటే మాత్రం సందీప్ రెడ్డి వన్ టైం వండర్ గా మిగిలిపోయే ఛాన్స్ ఉంది

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు