Pushpa Budget: అల్లు అర్జున్ ‘అతి’ జాగ్రత్త… నిర్మాతలను ముంచుతుందా?

ఇప్పుడు తెలుగు ఆడియన్స్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా అందరూ వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప2. దీనికి ఇంత హైప్ రావడానికి కారణం… పుష్ప మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే అని చెప్పొచ్చు. అయితే పుష్ప మొదటి భాగం పెద్ద హిట్ కాకపోయి ఉంటే… పుష్ప 2కు ఇంత హైప్ ఉండేది కాదు. ఇంకా చెప్పాలంటే.. పుష్ప 2 ఇప్పటికే రిలీజ్ అయిపోయేది.

పుష్ప 1 పెద్ద హిట్ కావడంతో, పుష్ప2 ఇంకా భారీ బ్లాక్ బస్టర్ అవ్వాలని సుకుమార్ తో స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేయించాడు అల్లు అర్జున్. అందుకు చాలా రోజులు.. కాదు కాదు.. చాలా నెలలు టైం ఖర్చు చేశారు. ఫస్ట్ అనుకున్న నటీనటుల విషయలో కూడా మార్పులు జరిగాయినే టాక్ వచ్చింది. ఇప్పుడు ఉన్న హైప్ కారణంగా, బాలీవుడ్ నటీనటులను సినిమాలో చేర్చుకున్నారనే ఓ గాసిప్ ఉంది.

షూటింగ్ టైంలో కూడా సుక్కు కంటే.. అల్లు అర్జున్ ఎక్కువ టెన్షన్ పడుతున్నాడని తెలుస్తుంది. ఒక షాట్ సరిగ్గా రాకుంటే.. మళ్లీ మళ్లీ చేయిస్తున్నాడని టాక్. దీంతో ఒక చిన్న సీన్ చేయడానికి కూడా వారం రోజులు వరకు టైం పడుతుందట. ఒక భారీ సీక్వెన్స్ కి అయితే… మరింత టైం పడుతుందట. దీని వల్ల బడ్జెట్ రోజు రోజుకు పెరిగిపోతుందట. పుష్ప2 ఇది తలకు మించిన భారం అవుతుందని నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కూడా అనుకుంటున్నారని వినిపిస్తుంది. అయితే పుష్ప1 కంటే… పుష్ప ది రూల్ భారీ విజయం సాధించబోతుందనే నమ్మకం కూడా ఉందని తెలుస్తుంది.

- Advertisement -

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి, బడ్జెట్ కు సంబంధించి ఇండస్ట్రీలో మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో గంగమ్మ జాతర హైలైట్ గా ఉండబోతుందట. ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా కూడా సినిమాలో గంగమ్మ గెటప్ లో అల్లు అర్జున్ ఉన్న ఒక పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే సినిమాలో ఈ గంగమ్మ జాతరను భారీగా ప్లాన్ చేస్తున్నారట. వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు… ఖరీదైన సెట్స్ మధ్య ఈ సీన్ షూట్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ ఒక్క జాతర సీన్ కే మూవీ టీం దాదాపు 50 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందట. దీంతో ఇప్పటికే భారీగా పెరిగిపోయిన మూవీ బడ్జెట్… ఈ జాతర బడ్జెట్ తో కలుపుకుని అనుకున్న దాని కంటే.. 50 శాతం వరకు పెరిగిపోయిందట.

ఇది ప్రస్తుతం బయట తెలియడంతో… అల్లు అర్జున్ జాగ్రత్త అతి అవుతుందని, అది నిర్మాతలకు భారంగా మారుతుందని ఇండస్ట్రీలో సినీ క్రిటిక్స్ అంటున్నారు. ఒక వేళ సినిమాకు మంచి టాక్ వస్తే.. పెట్టిన బడ్జెట్ తిరిగి రావడం అనేది ఎలాగూ జరుగుతుంది. కానీ, ఏ మాత్రం తేడా కొట్టినా, మైత్రీ మూవీ మేకర్స్ కు పెద్ద నష్టమే జరగొచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు