Animal Movie: యానిమల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డ్ బ్రేక్ చేసిన రణబీర్..!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా డిసెంబర్ 1న విడుదలైన చిత్రం యానిమల్. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. మరొకసారి సందీప్ బాక్స్ ఆఫీస్ వద్ద తన మార్కు క్రియేట్ చేశారనే చెప్పాలి. రణబీర్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. మాస్ యాక్షన్ హీరోగా రణబీర్ తన నటనతో పూర్తిస్థాయిలో అదరగొట్టారని చెప్పాలి.

ఇక ఇందులో బాబి డియోల్ విలన్ గా నటించగా.. రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఇక డిసెంబర్ ఒకటవ తేదీన ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఉదయం నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లో సునామి కురిపిస్తోంది. నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఇక మొదటి రోజే ఆడియన్స్ అంచనాలను దాటేసిన ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు సాధించింది అనే విషయానికి వస్తే.. ఇండియాలో రూ 65 కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు సమాచారం.

ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు వర్కింగ్ రోజుల్లో కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఈ ఏడాదిలో సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో మూడవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. మొదటి రోజు మార్నింగ్ షోలు 46% ఆక్యుపెన్సీ తో, మధ్యాహ్నం షోలు 54 శాతం ఆక్యుపెన్సీ తో రన్ అయ్యాయి. మరొకవైపు విడుదలకు ముందే దాదాపు 5 లక్షల టికెట్ సేల్ అయినట్టుగా సమాచారం.

- Advertisement -

ఇకపోతే వీకెండ్ లోపు యానిమల్ సినిమా సులభంగా రూ.350 కోట్ల వరకు వసూలు చేస్తుందని.. గతంలో చిత్ర బృందం అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే హిందీలో కబీర్ సింగ్ రూపొందించిన రికార్డును ఐదేళ్ల తర్వాత సందీప్ తెరకెక్కించిన యానిమల్ సినిమా బ్రేక్ చేయబోతోంది. దాదాపు కబీర్ సింగ్ కి ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేయగా దానిని ఇప్పుడు యానిమల్ సినిమా క్రాస్ చేయబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్లో తన సత్తా చాటుతూ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నారని చెప్పాలి. ఏది ఏమైనా టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ లో సత్తా చాటుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు