Rashmi Gautam: ఇండస్ట్రీలో ఉండాలంటే అలాంటి పనులు చేయాల్సిందే !

Anchor Rashmi Gautam sensational comments on tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో కొంతమంది ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన తర్వాత యాంకర్లుగా మారారు. మరికొంతమంది నేరుగా యాంకరింగ్ ఫీల్డ్ లోకి వచ్చారు. ఇక మరి కొంతమంది బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి యాంకర్లుగా కూడా కొనసాగుతున్నారు. ముఖ్యంగా మన తెలుగులో యాంకర్లు అనగానే సుమ, అనసూయ భరద్వాజ్, రష్మీ లాంటి పేర్లు వినిపిస్తాయి.

ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ యాంకర్ రష్మీ చాలా పాపులర్ అవుతున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది నటి రశ్మి. ఇందులో దాదాపు 10 సంవత్సరాలుగా యాంకర్ గా పని చేస్తోంది రష్మీ. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు వచ్చినా కూడా చేసేందుకు ముందుకు వెళుతోంది. గుంటూరు టాకీస్ లాంటి సినిమాలలో చిన్నపాటి హీరోయిన్ గా కూడా మెరిసింది యాంకర్ రష్మీ.

Anchor Rashmi Gautam sensational comments on tollywood

సైడ్ యాక్టర్ గా… అలాగే యాంకర్ గా… ఇటు హీరోయిన్ గా చాలా సినిమాలు తీస్తున్నప్పటికీ ఈ బ్యూటీ కి పెద్దగా సక్సెస్ మాత్రం రావడం లేదు. ఎప్పుడు కూడా జబర్దస్త్ షో ద్వారానే రశ్మి పాపులర్ అవుతూ ఉంది. ఈ బ్యూటీ కి సరైన సినిమా పడటం లేదు. అదే యాంకర్ అనసూయ భరద్వాజ మాత్రం చాలా సినిమాలలో చేసి ఇప్పుడు పాపులర్ అయిపోయింది. యాంకర్ అనసూయ భరద్వాజి లాగే తాను కూడా పాపులర్ కావాలని ఎప్పటినుంచో రష్మీ ప్రయత్నం చేస్తోంది. Anchor Rashmi Gautam

- Advertisement -

ఇది ఇలా ఉండగా తాజాగా… టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది నటి, యాంకర్ రష్మీ. ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే… టాలెంట్ అలాగే కష్టంతోపాటు ఎవరి అయినా కచ్చితంగా ఉండాలని చెబుతోంది యాంకర్ రష్మీ. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మీ ఈ వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సమయంలో తన వయసు చాలా చిన్నదని చెప్పుకొచ్చింది నటి రశ్మి. కానీ ఇప్పుడు తనకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిందని తెలిపింది. Anchor Rashmi Gautam

14 సంవత్సరాల వయసు సమయంలోనే తాను టాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది. ఆ వయసులో చాలా ఇబ్బందులు పడినట్లు వివరించింది రష్మీ. అలాగే తన తండ్రి కూడా ఆ సమయంలో లేడని… కానీ ఇండస్ట్రీలో నిల దొక్కుకునేందుకు చాలా కష్టపడ్డాను… అంటూ ఎమోషనల్ అయింది రష్మీ. ముఖ్యంగా ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టంతో పాటు ఇండస్సిలో ఒక పెద్ద మనకు అండగా ఉండాలని తెలిపింది. అప్పుడు తొందరగా సక్సెస్ అవుతామని వివరించింది. కాగా తనపై చాలామంది ట్రోల్లింగ్ చేశారని ఎమోషనల్ అయింది. అతనితో ఎఫైర్ ఉందనీ.. ఇతనితో ఉందని అనేక రకాల పోస్టులు పెట్టేవారని కానీ వాటన్నిటిని భరించి పైకి వచ్చానని చెప్పుకువచ్చింది. Anchor Rashmi Gautam

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు