Pushpa 2: ‘పుష్ప 2’ ఇంకా లేట్ ?

దర్శకుడు సుకుమార్ కు ‘రంగస్థలం’ ‘పుష్ప’ చిత్రాల తర్వాత మాస్ ఆడియన్స్ లో కూడా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ‘రంగస్థలం’ ముందు వరకు మాస్ ఆడియన్స్ పై ఫోకస్ పెట్టింది లేదు. అయితే ఈ రెండు చిత్రాలతో సుకుమార్ ఇమేజ్ భారీగా పెరిగింది. ‘పుష్ప’ చిత్రంతో అయితే బాలీవుడ్లో కూడా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. మిగిలిన భాషల్లో కూడా ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ‘పుష్ప’ చిత్రాన్ని సుకుమార్ ఇంత మనసు పెట్టి చేయలేదు. ‘చివరి నిమిషంలో హడావిడి హడావిడిగా చేసాము’ అని సుకుమార్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

అయితే హడావిడి హడావిడిగా చేస్తేనే ఇంత మంచి ఔట్ పుట్ వస్తే, కొంచెం టైం ఇచ్చి చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుందమో అని నిర్మాతలు నమ్ముతున్నారని సమాచారం. అందుకని ‘పుష్ప 2 ‘ విషయంలో టెన్షన్ పెట్టడం లేదని వినికిడి. అయితే, అల్లు అర్జున్ మాత్రం ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదే రిలీజ్ కావాలి అని టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పుష్ప 2 పై హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయని బన్నికి అరవింద్ తో పాటు సన్నిహితులు నచ్చ చెప్పారట. అలాగే సుకుమార్ ను టెన్షన్ పెట్టొద్దు అని, మూవీ ఆలస్యం అవ్వడం మేటర్ కాదు ఎంత బాగా వస్తే చాలని చెప్పారని తెలుస్తుంది.
దీంతో ‘పుష్ప 2’ విషయంలో సుకుమార్ మరింత టైం తీసుకుని, సెట్స్ పైకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ‘పుష్ప 2’ మరింత లేట్ అవ్వచ్చు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు