Thank You : వాయిదాకు, సామ్ కు సంబంధమేంటి?

నాగ చైతన్య- సమంత గతేడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. నిజానికి అంతకంటే ముందు నుండే వాళ్ళు వేరు వేరుగా ఉంటూ వచ్చారు. అయితే అధికారికంగా ఆ రోజున ప్రకటించారు. ఇక వాళ్ళిద్దరూ విడిపోయి ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైములో ఇటీవల చైతన్య, ‘గూఢచారి’ ‘మేజర్’ చిత్రాల హీరోయిన్ శోభిత ధూళిపాళ తో ప్రేమాయణం నడుపుతున్నాడు అని, వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు పుట్టుకొచ్చాయి. రెండు రోజుల్లోనే ఆ వార్త బాగా వైరల్ అయిపోయింది. అయితే ఈ వార్త బాలీవుడ్ మీడియా వాళ్ళు పుట్టించినది అని సమాచారం.

బాలీవుడ్ జనాలు చైతన్య పై ఫోకస్ పెట్టేంతలా ఇంకా అక్కడ పాపులర్ అవ్వలేదు. మరోపక్క చైతన్య, శోభిత లపై వచ్చిన డేటింగ్ వార్తల్లో కూడా నిజం లేదట. ఇది ఎవరో కావాలనే పుట్టించిన వార్త అని అక్కినేని ఫ్యామిలీ అభిప్రాయపడుతోంది. సరిగ్గా ‘థాంక్యూ’ సినిమా జూలై 8న రిలీజ్ అవుతుంది అనుకున్న టైంలో ఇలాంటి వార్త స్ప్రెడ్ చేస్తే చైతన్య పై నెగిటివిటీ ఏర్పడుతుంది. సినిమా దెబ్బతింటుంది. అని ఎవరో పనిగట్టుకుని ఈ వార్తను బాలీవుడ్ మీడియా ద్వారా ప్రచారమయ్యేలా చేసినట్లు తెలుస్తుంది. అందుకే ‘థాంక్యూ’ మూవీ జూలై 22 కు వాయిదా అయినట్టు భోగట్టా ! చైతన్య అభిమానులు మాత్రం, ఇది సమంత పనే అని అనుకుంటున్నారు. దీనికి సమంత ఘాటుగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు